ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 100
"ఆకాశం నీ హద్దురా "మూవీ రికార్డ్
'క్రాక్' రిలీజ్ డేట్ ఫిక్స్
ఐఎఎస్ ఆఫీసర్ గా బాలకృష్ణ
'కె.జి.ఎఫ్ 2' నుండి రానున్న సర్ప్రైజ్
'గతం' సినిమాకు అరుదైన అవకాశం

సినిమాలో మూడో హీరో పై క్లారిటీ
మాస్టర్ తెలుగు టీజర్ రిలీజ్
'ఎఫ్ 3' గ్రాండ్ లాంచ్

"సలార్ "మూవీ ఆడిషన్స్ కు విశేష స్పందన
హీరో ప్రభాస్ తో నటించాలని ఉంది - శృతి హాసన్
"డర్టీ హరి" మూవీ పై సునీల్ ప్రశంసలు
రష్మిక ఫిట్ నెస్ మంత్రం
హిందీ 'జెర్సీ' షూటింగ్ పూర్తి
హీరో రానా బర్త్ డే కు అనుష్క విషెస్
అభిజిత్ కు మద్దతుగా రౌడీ హీరో
కన్ఫామ్.. పవన్ తో రానా
రెండేళ్ళ తర్వాత రీఎంట్రీ ఇచ్చిన పవన్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో మలయాళంలో సూపర్ హిట్ అయిన 'అయ్యప్పనుమ్ కోశియనుమ్' సినిమా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. విజయదశమి రోజు ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ నిర్మించనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీని త్వరలో సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.
"ఆకాశం నీ హద్దురా "మూవీ రికార్డ్
2D ఎంటర్ టైన్ మెంట్ , సిఖ్య ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సుధ కొంగర దర్శకత్వంలో స్టార్ హీరో సూర్య , అపర్ణ బాల మురళి జంటగా ఎయిర్ దక్కన్ ఫౌండర్ జి ఆర్ గోపినాథ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన "సూరరై పోట్రు "(ఆకాశం నీ హద్దురా ) తమిళ మూవీ దీపావళి పండగ కానుకగా నవంబర్ 12 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ ప్రైమ్ వీడియో లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. OTT లలో రిలీజ్ అయిన మూవీస్ లో "ఆకాశం నీ హద్దురా" మూవీ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
'క్రాక్' రిలీజ్ డేట్ ఫిక్స్
కరోనా కారణంగా ఇన్ని రోజులు థియేటర్స్ మూతబడ్డాయి. ఇక ఇన్ని రోజులు డల్ గా ఉన్న బాక్స్ ఆఫీస్ వచ్చే సంక్రాంతికి మాత్రం పెద్ద ఎత్తున సందడి నెలకొనేలా కనిపిస్తుంది. చాలా సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు మరో సినిమా సంక్రాంతికి రెడీ అవుతుంది. అదే క్రాక్ సినిమా. మాస్ మహారాజా రవితేజ, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందుతున్న మూడో చిత్రం 'క్రాక్'. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.
ఐఎఎస్ ఆఫీసర్ గా బాలకృష్ణ
ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మాస్ మసాలా మూవీస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా యాక్షన్ ఎంటర్ టైనర్ "BB3 " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో హీరో బాలకృష్ణ ఐఎఎస్ ఆఫీసర్, అఘోరా గా రెండు పవర్ ఫుల్ క్యారెక్టర్స్ లో నటిస్తున్నారు. "BB3 " మూవీలో ప్రగ్య జైస్వాల్ , పూర్ణ కథానాయికలుగా ఎంపికఅయ్యారు. శ్రీకాంత్ , నవీన్ చంద్ర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.
'కె.జి.ఎఫ్ 2' నుండి రానున్న సర్ప్రైజ్
సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూసే సినిమాల్లో కె.జి.ఎఫ్ 2 ఒకటి అని కూడా చెప్పొచ్చు. ‘కె.జి.ఎఫ్’ బ్లాక్ బస్టర్ కొట్టడంతో ఈ సినిమాపై కూడా అదే రేంజ్ లో అంచానాలు పెంచుకున్నారు అభిమానులు. ఇక అభిమానులను ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశ పెట్టకూడదన్న నేపథ్యంలో ఈ సినిమా అవుట్ ఫుట్ కోసం కోసం చిత్ర యూనిట్ అదే రేంజ్ లో కష్టపడుతున్నట్టు తెలుస్తుంది.
'గతం' సినిమాకు అరుదైన అవకాశం
కిరణ్ రెడ్డి దర్శకత్వంలో భార్గవ పొలుదాసు, రాకేష్ గాలెబె , పూజిత కూరపర్తి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'గతం'. సైకలాజికల్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమా ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. ఇక టీజర్,ట్రైలర్ లతోనే సినిమాపై అంచనాలు పెంచిన ఈ థ్రిల్లర్.. సినిమా కూడా అదే రేంజ్ లో ఉండి మంచి ప్రశంసలు దక్కించుకుంది. చాలా గ్రిప్పింగ్ ఎలిమెంట్స్ తో.. మిస్టరీ గా ఉందన్న మంచి టాక్ ను అయితే సొంతం చేసుకుంది.
'సోలో బ్రతుకే సో బెటర్' ట్రైలర్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్
సుబ్బు దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మరికొద్దిరోజుల్లో ఈ సినిమా థియేటర్ రిలీజ్ కానుంది. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇక లాక్‌డౌన్ తరవాత థియేటర్లలో విడుదలవుతోన్న సినిమా కావడంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సినిమాలో మూడో హీరో పై క్లారిటీ
వరుస హిట్స్ తో టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నాడు అనిల్ రావిపూడి. ప్రస్తుతం ఎఫ్3 సినిమాతో బిజీగా వున్నాడు. వెంకటేష్, వరుణ్ ప్రధాన పాత్రల్లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో గత ఏడాది సంక్రాంతికి వచ్చిన ఎఫ్ 2 సినిమా దిల్ రాజుకు దాదాపు 50 కోట్లకు పైగానే లాభాలు తీసుకొచ్చింది. ఇప్పుడు ఏఫ్3 సినిమాతో డబుల్ హ్యాట్రిక్ సినిమా చేయడానికి రాబోతున్నాడు. నిన్ననే ఈ సినిమాను గ్రాండ్ గా లాంఛ్ చేసారు చిత్రయూనిట్.
బిగ్ బాస్ 4 - కంటెస్టెంట్ల ఎమోషనల్ జర్నీ
బిగ్ బాస్ 4 - ముగింపుకు కౌంట్ డౌన్ మొదలైంది. ఇక కొన్ని గంటలు మాత్రమే ఉంది ఈ సీజన్ ముగియడానికి. ప్రస్తుతం హౌస్ లో ఐదుగురు ఉండగా అభి, అఖిల్ ల జర్నీ ల వీడియోలను చూపించగా.. ఈరోజు మిగిలిన ముగ్గురు జర్నీల వీడియోలను చూపించారు. ఇక ఈ రోజు ఎవరి జర్నీ లో ఏం చూపించారు.. ఎవరికి ఎలాంటి ప్రశంసలు దక్కాయి లాంటి విషయాలు తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ లోకి వెళ్లాల్సిందే.
మాస్టర్ తెలుగు టీజర్ రిలీజ్
లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విజయ్ ప్రధాన పాత్రలో ఈ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల చిత్రయూనిట్ ఈ సినిమా టీజర్‌ను కూడా రిలీజ్ చేయగా.. టీజర్ కు మాత్రం సూపర్ రెస్పాన్స్ వచ్చిన సంగతి కూడా విదితమే. ఇప్పటికే “మాస్టర్” టీజర్ మిలియన్ వ్యూస్ తో రికార్డులను క్రియేట్ చేసింది.
'గువ్వ గోరింక'.. ఈ కారణాలు చాలు సినిమాను చూడడానికి...
సత్యదేవ్, మలయాళం నటి ప్రియాలాల్, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా 'గువ్వ గోరింక'. రామ్‌గోపాల్ వర్మ శిష్యుడు మోహన్ బమ్మిడి దర్శకత్వం వహించిన ఈసినిమాను.. జీవన్, దాము సంయుక్తంగా నిర్మించారు. ఇంకా ఈ సినిమాలో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, మధుమిత కృష్ణ, ఫిష్ వెంకట్, ప్రభాకర్ ఇతరులు ఈ చిత్రంలో నటించారు. ఇక ఈ సినిమా ఈనెల 17న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. ఇప్పుడు ఈ సినిమాకు మంచి స్పందనే వస్తుంది. ఈ చిత్రాన్ని చూడడానికి ప్రధానంగా ఉన్న కొన్ని కారణాలు ఏవో ఒకసారి తెలుసుకుందాం.
'ఎఫ్ 3' గ్రాండ్ లాంచ్
వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఎఫ్2'. గత ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ సినిమా సీక్వెల్ ను కూడా అనిల్ రావిపూడి లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా కథను కూడా రెడీ చేసి పెట్టుకున్నాడు. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకున్నాడు.

"సలార్ "మూవీ ఆడిషన్స్ కు విశేష స్పందన
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ "కె జి ఎఫ్ చాప్టర్ 1"మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా యాక్షన్ ఎంటర్ టైనర్ "సలార్" మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. "సలార్" మూవీలో న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేయడానికై దర్శక , నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు. హెదరాబాద్ , చెన్నై , బెంగళూరు లలో ఆడిషన్స్ నిర్వహించి కొత్త టాలెంట్ కు అవకాశం కల్పించడానికై దర్శకుడు ప్రకటించారు. ఏ వయస్సు వారైనా , ఏ భాష వారైనా ఆడిషన్స్ లో పాల్గొన వచ్చునని తెలిపారు.

'ఆర్ఆర్ఆర్' - 10 రోజుల షూట్ పూర్తి చేసుకున్న అలియా భట్
ఆర్ఆర్ఆర్ టీమ్ బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ ను ప్లాన్ చేస్తూ బిజీగా షూట్ చేసే పనిలో పడ్డారు. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తవ్వాలి. అసలే లేట్ అవ్వగా కరోనా వల్ల మరింత లేట్ అయింది. అయితే ఇటీవలే ఈ సినిమా షూట్ ను మళ్లీ మొదలు పెట్టగా రాజమౌళి మాత్రం ఇక ఎలాంటి బ్రేక్ లేకుండా షూటింగ్ షెడ్యూల్స్ ను ప్లాన్ చేస్తున్నాడు. అందులో భాగంగా ఇటీవలే 50రోజుల లాంగ్ షూటింగ్‌ను పూర్తి చేసుకోగా తక్కువ గ్యాప్ లోనే మహారాష్ట్రలోని మహాబలేశ్వరం మరో షెడ్యూల్ ను ప్లాన్ చేశారు. ఇక ఆ షెడ్యూల్ తర్వాత, బాలీవుడ్ నటి అలియా భట్ రీసెంట్ గా షూటింగ్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే.
హీరో ప్రభాస్ తో నటించాలని ఉంది - శృతి హాసన్
స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "క్రాక్ " మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేశారు. విజయ్ సేతుపతి హీరోగా రూపొందుతున్న "లాభం "తమిళ మూవీ లో శృతి కథానాయికగా నటిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న "వకీల్ సాబ్ "మూవీ లో శృతి కథానాయికగా ఎంపిక అయ్యారు. "గబ్బర్ సింగ్ ", "కాటమ రాయుడు " మూవీస్ తో పవన్ కళ్యాణ్ , శృతి జోడీ ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే.
"డర్టీ హరి" మూవీ పై సునీల్ ప్రశంసలు
గూడూరు శివ రామకృష్ణ సమర్పణలో ఎస్ పి జె క్రియేషన్స్ బ్యానర్ పై శ్రవణ్ రెడ్డి హీరోగా, పలు బ్లాక్ బస్టర్ మూవీస్ నిర్మించిన ఎమ్ ఎస్ రాజు దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ "డర్టీ హరి " మూవీ డిసెంబర్ 18 వ తేదీ థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ మూవీ లో రుహానీ శర్మ , సిమ్రత్ కౌర్ కథానాయికలు. మార్క్ K రాబిన్ సంగీతం అందించారు.
రష్మిక ఫిట్ నెస్ మంత్రం
తెలుగు,కన్నడ భాషల లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తూ రష్మిక తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ "పుష్ప "మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. రష్మిక హీరోయిన్ గా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి. సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ రష్మిక అభిమానులను అలరిస్తున్నారు. "సుల్తాన్ "మూవీ తో రష్మిక కోలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.
హిందీ 'జెర్సీ' షూటింగ్ పూర్తి
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని, శ్రద్ధ శ్రీనాథ్ హీరోహీరోయిన్లు గా తెరకెక్కిన సినిమా జెర్సీ. ఈ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడమే కాదు... విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. జెర్సీ సినిమాలో అర్జున్ పాత్రలో నాని చేసిన నటనకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. క్రికెట్‌ను వదిలేసి, ప్రభుత్వ ఉద్యోగం పోయి పనిపాటా లేకుండా ఇంట్లో ఖాళీగా ఉంటూ.. ఆ తర్వాత కొడుకు కోసం క్రికెట్ ఆడటం సినిమా మొత్తం ఒక ఎమోషనల్ జర్నీ అని చెప్పొచ్చు.
హీరో రానా బర్త్ డే కు అనుష్క విషెస్
సక్సెస్ ఫుల్ "లీడర్ " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన రానా దగ్గుబాటి తెలుగు , తమిళ , హిందీ భాషా చిత్రాలలో నటించి ప్రేక్షకులను అలరించారు. రానా ప్రస్తుతం "విరాటపర్వం "మూవీ లో కథానాయకుడిగా నటిస్తున్నారు.ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న "విరాటపర్వం "మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. రానా హీరోగా తెలుగు , తమిళ , హిందీ భాషలలో రూపొందిన "అరణ్య "మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.
అభిజిత్ కు మద్దతుగా రౌడీ హీరో
బిగ్ బాస్ సీజన్ ముగియడానికి ఇంకా కేవలం ఒక వారం మాత్రమే ఉంది. ప్రస్తుతం టాప్ 5 కంటెస్టెంట్స్ మాత్రమే హౌస్ లో వున్నారు. ఇక ఓటింగ్ పోల్ కూడా నిన్ననే ఓపెన్ అవ్వడంతో తమ అభిమానులను గెలిపించే పనిలో పడ్డారు. ఓట్లు వేసే పనిలో పడ్డారు. ఇక ఆఖరి అంకానికి చేరడంతో కంటెస్టెంట్స్ కు కూడా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది.