శృతి హాసన్ “జ్వాలాముఖి”

Actress Shruti Haasan Says That She Would Name Her Biopic Title As Jwalamukhi

మల్టీ టాలెంటెడ్ శృతి హాసన్ తెలుగు , తమిళ , హిందీ భాషల బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. రవితేజ హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “క్రాక్ “మూవీ షూటింగ్ ను శృతి  రీసెంట్ గా కంప్లీట్ చేశారు . విజయ్ సేతుపతి హీరోగా రూపొందుతున్న “లాభం “తమిళ మూవీ లో శృతి కథానాయికగా నటిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ గా తెరకెక్కుతున్న కోర్ట్ డ్రామా “వకీల్ సాబ్ ” మూవీ లో శృతి కథానాయికగా ఎంపిక అయ్యారు. త్వరలోనే శృతి “వకీల్ సాబ్ ” మూవీ షూటింగ్ లో పాల్గొంటారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ శృతి తన రీల్ లైఫ్ , రియల్ లైఫ్ విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఇన్ స్టాగ్రామ్ లో 15.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న శృతి శుక్రవారం ఇన్ స్టాగ్రామ్ లో అభిమానులతో ముచ్చటించారు. మీ జీవితమే ఒక సినిమా అనుకుంటే దానికి ఏమని టైటిల్ పెడతారని అడిగిన అభిమాని ప్రశ్న కు శృతి “జ్వాలాముఖి “టైటిల్ పెడతానని జవాబిచ్చారు. ఎటువంటి సాధన లేకుండా యాక్టింగ్ లో ప్రావీణ్యం సంపాదించుకొనడం తన అదృష్టమనీ , బెస్ట్ పెర్ఫార్మెన్స్ కై నిరంతరం శ్రమిస్తూనే ఉంటాననీ, పౌరాణిక పాత్రలలో నటించాలని ఉందనీ , నెగటివ్ క్యారెక్టర్ లో ఒక సారైనా కనిపించాలనేది తన కోరిక అనీ శృతి చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + 7 =