మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక జంటగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. జగపతి బాబు , ప్రకాష్ రాజ్ , సునీల్ , వెన్నెల కిషోర్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో తెరకెక్కుతున్న “పుష్ప “మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈమూవీ లో తన పాత్రకై రష్మిక రాయలసీమ స్లాంగ్ ను నేర్చుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
లాక్ డౌన్ తరువాత “పుష్ప” మూవీ షూటింగ్ మారేడుమిల్లి అడవుల్లో ప్రారంభం అయ్యింది. అక్కడ కొన్ని యాక్షన్ సీన్స్ , సాంగ్స్ ను దర్శకుడు సుకుమార్ చిత్రీకరించారు. యూనిట్ మెంబర్స్ లో కొంతమంది కి కొవిడ్ -19 సోకడంతో షూటింగ్ నిలిచిపోయింది. “పుష్ప “మూవీ షూటింగ్ వచ్చే వారం నుండి హైదరాబాద్ లో పునః ప్రారంభం కానుంది. హైదరాబాద్ లోని ఒక ఫామ్ హౌస్ లో ఈ మూవీ లోని కీలక సన్నివేశాలను తెరకెక్కించడానికి దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేశారు. హీరో అల్లు అర్జున్ కూడా “పుష్ప “మూవీ షూటింగ్ ను త్వరగా కంప్లీట్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. బ్లాక్ బస్టర్ “అల .. వైకుంఠపురములో .. “మూవీ తరువాత అల్లు అర్జున్ నటించే “పుష్ప “మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: