కాబోయే వరుడు.. వెడ్డింగ్ గురించి రకుల్ మాటల్లో

Rakul Preet Singh Reveals About Her Perspective On Wedding And An Ideal Husband,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Latest Tollywood News,Rakul Preet Singh,Rakul Preet Singh Latest News,Rakul Preet Singh Upcoming Movie Details,Rakul Preet Singh Next Project NewsOn Cards,Rakul Preet Singh About Marriage,Rakul Preet Singh About Her Wedding,Actress Rakul Preet Singh Reveals About Her Perspective On Wedding

రకుల్ ప్రీత్ సింగ్ గతంలో ఒకసారి తనకు కాబోయే భర్త ఎలా ఉండాలి.. ఎలాంటి క్వాలిటీస్ కలిగి ఉండాలి అని చెప్పిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా. ఇక ఇప్పుడు మరోసారి తనకు కాబోయేవాడు ఎలా ఉండాలి, తమ పెళ్లి ఎలా జరగాలి అనే విషయాలు చెప్పుకొచ్చింది. తాజాగా ఓ ప్రముఖ మ్యాగజైన్ కోసం ఫొటో షూట్‌లో పాల్గొంది. ఇక ఈ సందర్భంగా ఆమె..తనకు ప్రేమ, పెళ్లిపై నమ్మకముందని చెప్పుకొచ్చింది. అంతేకాదు తాను సంప్రదాయాలకు విలువిచ్చే కుటుంబం నుంచి వచ్చానని, నాన్న ఆర్మీ ఉద్యోగం చేశారు కాబట్టి ఆ వాతావరణంలోనే పెరిగానని తనకు కాబోయే భర్త కూడా ఆరోగ్యకరమైన లైఫ్‌స్టైల్‌ని ఫాలో అయితే చాలా సంతోష పడతానని తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అక్కడితో ఆగలేదు ఈ భామ.. పెళ్లి వేదిక గురించి కూడా చెప్పేసింది. బీచ్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటానాని..అదికూడా కేవలం అత్యంత సన్నిహితుల సమక్షంలో కేవలం ఒక 100 మందికి మాత్రమే ఉండేలా తమ వివాహం జరగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. మరి కాజల్ వివాహం చేసేసుకుంది. ఈనేపథ్యంలో రకుల్ కూడా ఆ దిశగా ఏమన్నా అడుగులు వేసే అవకాశం ఉందంటారా..చూద్దాం ఈ భామ ఎప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతుందో.

 

View this post on Instagram

 

A post shared by Rakul Singh (@rakulpreet)

ఇక రకుల్ సినిమాల విషయానికొస్తే రకుల్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నితిన్-చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న ‘చెక్’ సినిమాలో కూడా నటిస్తుంది. ఇంకా హిందీలో జాన్ అబ్రహాం “అటాక్ “, అర్జున్ కపూర్ ” ఛలే ఛలో ” మూవీస్ లో నటిస్తుంది. ఇక తమిళనాట కూడా రెండు సినిమాల్లో నటిస్తుంది. శంకర్ దర్శకత్వంలో కమలహాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఇండియన్ 2 సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.