వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎఫ్2’. గత ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘ఎఫ్2’లో వెంకటేష్, వరుణ్ తేజ్‌లతో అనిల్ రావిపూడి ఏ రేంజ్‌లో నవ్వులు పూయించాడో తెలిసిందే. ఇక ఈ సినిమా సీక్వెల్ ను కూడా అనిల్ రావిపూడి లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా కథను కూడా రెడీ చేసి పెట్టుకున్నాడు. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లడమే లేట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా నిన్న వెంకటేష్ పుట్టిన రోజు సందర్భంగా F3 నుండి ఒక అప్ డేట్ ఇచ్చారు. అదేంటంటే.. ఈ సినిమా కు సంబంధించి కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో వెంకటేష్, వరుణ్‌తేజ్ ఫుల్ డబ్బులతో నిండి ఉన్న రెండు తోపుడు బండ్లతో కనిపిస్తున్నారు. ‘ఈసారి మూడింతల వినోదం కోసం ప్రేక్షకులు సిద్ధంగా ఉండండి’ అంటూ తన ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. చూద్దాం మరి ఈసారి ఏ రేంజ్ లో నవ్వించడానికి వస్తున్నారో.
Triple the fun this time with #F3Movie ! Can’t wait for this one @AnilRavipudi @tamannaahspeaks @IAmVarunTej @Mehreenpirzada @ThisIsDSP @SVC_official pic.twitter.com/yFQ5GmdQUp
— Venkatesh Daggubati (@VenkyMama) December 13, 2020
కాగా దిల్‌రాజు సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలో ఈ సినిమాను సెట్స్‌మీదకు తీసుకెళ్లనున్నారు. ఇక F2 నటించిన తమన్నా, మెహ్రిన్ లే ఈ సినిమాలో కూడా నటిస్తుండగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో నటించే ఇతర నటీనటుల వివరాలు త్వరలోనే తెలియచేయనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: