బిగ్ బాస్ 4 – మొన్న సోహెల్-అరియానా మధ్య పెద్ద గొడవ వల్ల హౌస్ మొత్తం ఫుల్ హీట్ లో ఉండగా.. నిన్నటి ఎపిసోడ్ తో కాస్త కూల్ అయినట్టు వున్నారు హౌస్ మేట్స్. మరి నిన్నటి ఎపిసోడ్ లో ఎం జరిగిందో ఒక లుక్కేద్దాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మిమ్మల్ని మీరు నిరూపించుకోండంటూ బిగ్‌బాస్ “ఏకాగ్రత” అనే మూడో టాస్క్ ఇచ్చాడు. ఇందులో ఇంటిసభ్యులు 30 నిమిషాలను లెక్కపెట్టాల్సి ఉంటుంది. వారికోసం బిగ్ బాస్ ఉల్లిపాయలు, ఆలు, మొక్క జొన్నలు, బట్టలు ఇంకా చాలా ఐటమ్స్ ఇచ్చాడు. ఎవరికి నచ్చిన వాటిని వారు ఎంచుకోవచ్చు. ఇలా రకరకాల పనులను చేస్తూ ఈ టాస్క్ పూర్తి చేయాలి. వీళ్లను మిగతా ఇంటిసభ్యులు డిస్టర్బ్ చేసుకోవచ్చు. మొదట మోనాల్‌తో టాస్క్ మొదలవగా ఆమెను ఇంటి సభ్యులు వరుస ప్రశ్నలడుగుతూ ఏకాగ్రత దెబ్బ తీసేందుకు ప్రయత్నించారు. తర్వాత అరియానా, హారిక, అభి , సోహెల్ టాస్క్ పూర్తి చేశారు. ఈ టాస్క్ లో కాస్త అటు ఇటుగా ఆరియానా టైం తక్కువ ఉండటంతో మరోసారి ప్రేక్షకులతో మాట్లాడే అవకాశం పొందింది. ఈ సందర్భంగా మీకెంత దగ్గరైతే అంత ముందుకెళ్తానని చెప్పుకొచ్చింది. నేనంటే కొద్దిగా ఇష్టం, కొద్దిగా కష్టమైన వారికి కూడా లవ్‌యూ చెప్తున్నానంది.
ఆ తర్వాత జెమ్స్‌తో పోరాడే టాస్క్ ఇచ్చాడు. దీనిలో అరియానా, సోహెల్, మోనాల్ ఉండగా.. హారిక అఖిల్ జెమ్స్ గా సంచాలకుడిగా అభిని నియమించాడు బిగ్ బాస్. ఇక ఈ టాస్క్ లో సోహైల్ గెలిచాడు.
ఆ తర్వాత మోనాల్, సోహెల్ అఖిల్ ను ఫ్లర్ట్ చేస్తున్నాడంటూ, పులిహోర కలుపుతున్నాడంటూ ఏడిపించారు. అయితే కామెడీ కాస్త సీరియస్ అయింది . ఒకమ్మాయిని ఫ్రెండ్‌గా తీసుకుంటే తప్పేమీ కాదని.. నేనేదో చేసేస్తున్నా అన్నట్లుగా మాట్లాడుతున్నావని మోనాల్ మీద సీరియస్ అయ్యాడు. నీవు మొదటి నుంచీ ఫ్లర్టింగ్ చేస్తున్నావు కానీ ఈ మధ్య కొంచెం ఎక్కువైంది. అది చూడటానికి బాగోలేదు అని ఉన్నమాట చెప్పింది. నిన్ను ఏదో బ్యాడ్ చేయడానికి ఇలా చెప్పట్లేదని స్పష్టం చేసింది. అఖిల్ మాత్రం ఆమె మాటలతో ఏకీభవించలేదు. ‘నేను అందరి ముందే మజాక్ చేస్తున్నాను అంతే, నీకు తప్పుగా అనిపిస్తే నాకు చెప్పకు, నాతో మాట్లాడకు’ అని మాట్లాడటంతో మోనాల్ హర్టై అక్కడ నుంచి వెళ్లిపోయింది. నువ్వు వేరే వాళ్లతో మాట్లాడితే ఎలా ఫీల్ అవుతావో నేను కూడా అలానే.. నీకు చెప్పే రైట్ ఉందని అనుకుంటున్నాను.. నీతో టైమ్ స్పెండ్ చేయాలని ఉందని చెప్పింది. అలా అనిపిస్తే ఎక్కడో మూలన ఎందుకు కూర్చుంటావు అని ఆగ్రహం వ్యక్తం చేసాడు.
తర్వాత సోహైల్ అరియానాతో మాట్లాడి ఇష్యూను క్లియర్ చేసుకుందామని అనుకుంటాడు. దానికి అరియానా అవినాష్ లేనప్పుడు అతడి గురించి మాట్లాడటం, నాపైకి దూసుకుంటూ రావడం నచ్చలేదని అరియానా ముఖం మీదే చెప్పింది. టాస్క్ వల్ల ఈ పంచాయితీ అయిందని, ఇందులో ఇద్దరిదీ తప్పుందని సోహైల్ అన్నాడు. ఫైనల్ గా ఇష్యూ మాత్రం క్లియర్ అవ్వలేదు.
మరోవైపు ఇదే విషయంపై అఖిల్, సోహెల్ కు కూడా చిన్న గొడవ అవుతుంది. మూడో మనిషి గురించి నీకెందుకు… నువ్వెందుకు ఇన్వాల్వ్ అవ్వుతావు అని అనడంతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక మళ్లీ అఖిల్ ఓదార్చడం.. సోహెల్ కూల్ అవ్వడం జరిగిపోతుంది.
మరి ఇంకా పది రోజులే ఉండటంతో కంటెస్టెంట్స్ లో రోజుకో కోణం కనిపిస్తుంది. ఇక సోహెల్-అరియానా పంచాయితీ నాగార్జున వస్తే కానీ ఒక కొలిక్కి వచ్చేలా లేదు. చూద్దాం మరి నాగ్ ఎవరికి క్లాస్ పీకుతాడో.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: