బ్లాక్ బస్టర్ “ప్రేమకావాలి ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన డైలాగ్ కింగ్ సాయి కుమార్ తనయుడు ఆది సాయి కుమార్ “సుకుమారుడు “, “రఫ్ “, చుట్టాలబ్బాయి “, ఆపరేషన్ గోల్డ్ ఫిష్ ” వంటి మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. ఆది ఇప్పుడు ఒక హారర్ మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. హీరో ఆది ఫస్ట్ టైమ్ హారర్ మూవీలో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రణ్ వీర్ కుమార్ సమర్పణలో న్యూ ఏజ్ సినిమా , ఆరా సినిమాస్ బ్యానర్స్ పై కార్తీక్ -విఘ్నేష్ దర్శకత్వంలో ఆది సాయి కుమార్ , వేదిక జంటగా అది శ్వాసిస్తుంది , అది దాక్కొని ఉంటుంది , అది వేలాడు తుంది క్యాప్షన్ తో రూపొందిన హారర్ మూవీ ” జంగిల్ ” షూటింగ్ కంప్లీట్ అయ్యింది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు చిత్ర యూనిట్ ” జంగిల్ ” మూవీ టీజర్ ను రిలీజ్ చేసింది . ఈ టీజర్ లో విజువల్స్ , జోస్ ఫ్రాంక్లిన్ అందించిన నేపథ్య సంగీతం భయం గొలిపేలా ఉండి ” జంగిల్ ” మూవీ పై ఆసక్తి కలిగేలా చేశాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: