ట్యాగ్ · 31 కథనాలు
"శ్యామ్ సింగ రాయ్ " మూవీ అప్ డేట్
కెమెరాముందుకు వస్తున్నా.. మీ దీవెనలు కావలి..!
తాప్సీ ద్విపాత్రాభినయం
బిగ్ స్టార్స్ తో చేయడం నా డ్రీం కాదు

2007 నుండే నా మైండ్ లో ఉంది - ఇంద్రగంటి
ప్రేక్షక , అభిమానులకు కృతజ్ఞతలు - నాని
'వి' ట్రైలర్ చూసి మహేష్, కృష్ణ గారి రియాక్షన్ అదే
టాలీవుడ్ లో పూర్తి సంతృప్తిగా ఉన్నా - హీరో నాని
మీరు చూసింది స్క్రాచ్ మాత్రమే -'V' లో చాలా ఉంది

'వి' మూవీ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్
సత్య దేవ్ నటనపై పవన్ ప్రశంస
"V" మూవీ ఆన్ లైన్ ప్రీ రిలీజ్ ఈవెంట్
పర్యావరణ పరిరక్షణకై రష్మిక సందేశం
హైదరాబాద్ లో భారీ సెట్
ఫాంటసీ డ్రామా మూవీ లో తాప్సీ
ఫ్యాషన్ స్టూడియోస్ బ్యానర్ పై దీపక్ సుందర్ రాజన్ దర్శకత్వంలో తాప్సీ ప్రధాన పాత్రలో ఒక ఫాంటసీ డ్రామా తమిళ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. హీరో విజయ్ సేతుపతి ఒక కీలక పాత్రలో నటించారు. ఈ మూవీ లో తాప్సీతో పాటు విజయ్ సేతుపతి కూడా ద్విపాత్రాభినయం చేయడం విశేషం. రాజస్థాన్ జైపూర్ పరిసరాలలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఈ మూవీ కి "అన్నాబెల్లె సుబ్రమణ్యం" టైటిల్ పరిశీలనలో ఉంది.
"శ్యామ్ సింగ రాయ్ " మూవీ అప్ డేట్
తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో ప్రేక్షకులను అలరిస్తున్న హీరో నాని ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ "టక్ జగదీష్ " మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా ఆ మూవీ షూటింగ్ నిలిచిపోయింది. త్వరలోనే "టక్ జగదీష్ " మూవీ షూటింగ్ పునః ప్రారంభం కానుంది. ఈ మూవీ తరువాత నాని , సక్సెస్ ఫుల్ "టాక్సీవాలా " మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో "శ్యామ్ సింగ రాయ్ " మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
కెమెరాముందుకు వస్తున్నా.. మీ దీవెనలు కావలి..!
నటి, దర్శకురాలిగా, రచయితగా తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది రేణూదేశాయ్. ప్రస్తుతం మెగా ఫోన్ పట్టి ఒక సినిమాను తెరకెక్కించే పనిలో పడింది. రైతు సమస్యలపై ఓ సినిమాను రూపొందిస్తున్నారు రేణు దేశాయ్. ఇప్పటికే ఈ సినిమా కోసం పలువురు రైతులను కలిశారు రేణు దేశాయ్. తాజాగా గోరటి వెంకన్నతో పాట కూడా రాయించుకున్నట్టు తెలిపింది. ఇక ఇదిలా ఉండగా అవకాశం వస్తే మళ్ళీ నటిస్తానని రేణుదేశాయ్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇన్నేళ్ల తర్వాత కెమెరా ముందుకు రానున్నట్టు తెలిపింది.
గోరేటి వెంకన్నతో లిరిక్ సెషన్ - చాలా గర్వంగా ఉంది
కేవలం నటి మాత్రమే కాదు.. దర్శకురాలిగా, రచయితగా, నిర్మాతగా కూడా రేణు దేశాయ్ కు మంచి పేరుంది. పూరీ జగన్నాథ్ సినిమా బద్రితో తెలుగు తెరకు పరిచయమై.. ఇక అదే సినిమాలో హీరోగా నటించిన పవన్ ను ప్రేమించి పెళ్లాడిన హీరోయిన్ కమ్ డైరెక్టర్ రేణు దేశాయ్. కేవలం రెండు సినిమాల్లోనే నటించిన రేణు పవన్ కళ్యాణ్ ను పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్నేళ్లు కలిసి ఉన్న వీరు ఆ తరువాత విడిపోయారు. ఇక మళ్లీ సినిమాలపై తన దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే.
తాప్సీ ద్విపాత్రాభినయం
"ఝుమ్మంది నాదం " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పంజాబీ బ్యూటీ తాప్సీ తెలుగు , తమిళ భాషలలో పలు సూపర్ హిట్ చిత్రాలలో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సూపర్ హిట్ "ఛష్మే బద్దూర్ " మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయిన తాప్సీ సూపర్ హిట్ ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాప్సీ ప్రస్తుతం "హసీనా దిల్ రుబా ", "శభాష్ మిథు "(హిందీ ), "జనగణమన " తమిళ మూవీ లో నటిస్తున్నారు.
లైన్ ప్రొడ్యూసర్ గోపీకృష్ణ కు మహేష్ బాబు అభినందనలు
టాలీవుడ్ లైన్ ప్రొడ్యూసర్ , ఫారిన్ షూట్ కో- ఆర్డినేటర్ గోపీకృష్ణ నర్రావుల కు సూపర్ స్టార్ మహేష్ బాబు అభినందనలు తెలిపారు. "బజార్ రౌడీ "(1988 ) మూవీ తో లైన్ ప్రొడ్యూసర్ గా మారిన గోపికృష్ణ మహేష్ బాబు నటించిన అనేక సూపర్ హిట్ మూవీస్ కు పని చేశారు . చిరంజీవి (సైరా నరసింహా రెడ్డి ), పవన్ కళ్యాణ్ (గబ్బర్ సింగ్ , అత్తారింటికి దారేది ), ఎన్టీఆర్ (నాన్నకు ప్రేమతో ), ప్రభాస్ (మిర్చి ) మూవీస్ కు వర్క్ చేశారు.
బిగ్ స్టార్స్ తో చేయడం నా డ్రీం కాదు
సాధారణంగా ఏ డైరెక్టర్ అయినా పెద్ద పెద్ద స్టార్స్ తో చేయాలన్న డ్రీం ఉంటుంది. కానీ నాకు అలాంటి డ్రీం ఏం లేదు.. టాలెంటెడ్ నటీ నటులను సినిమాకు పరిచయం చేయడమే తన డ్రీం అంటున్నాడు. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో కాదు సహజత్వానికి దగ్గరగా సినిమాలు తీసే ఇంద్రగంటి మోహన్ కృష్ణ. మరి ఇంద్రగంటి సినిమాలు చూస్తేనే చెప్పొచ్చు తను ఇలాంటి వ్యాఖ్యలు చేయడంలో ఎలాంటి తప్పు లేదని. తాజాగా 'దితెలుగుఫిలింనగర్.కామ్' ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు ఇంద్రగంటి.

2007 నుండే నా మైండ్ లో ఉంది - ఇంద్రగంటి
ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో నాని-సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో 'వి' సినిమా వచ్చిన సంగతి తెలిసిందే కదా. సెప్టెంబర్ 5న ఈ సినిమా అమెజాన్ లో రిలీజ్ అయిన సంగతి కూడా విదితమే. ఇంద్రగంటి యాక్షన్ సినిమాలు తీయడం మొదటిసారి కావడంతో ఈ సినిమా తీసిన విధానంపై ఈ సినిమాకు మంచి ప్రశంసలే దక్కాయి. ఇక ఈ సందర్భంగా 'దితెలుగుఫిలింనగర్.కామ్' ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ "భలే భలే మగాడివోయ్ "
హీరో నాని తాను నటించే మూవీస్ లో తన దైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. యు వి క్రియేషన్స్ , GA 2 పిక్చర్స్ బ్యానర్స్ పై నాని , లావణ్య త్రిపాఠి జంటగా రూపొందిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ "భలే భలే మగాడివోయ్ " మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మురళి శర్మ , నరేష్ , వెన్నెల కిషోర్ , అజయ్ ముఖ్య పాత్రలలో నటించారు. గోపిసుందర్ సంగీతం అందించారు.
ప్రేక్షక , అభిమానులకు కృతజ్ఞతలు - నాని
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నాని , సుధీర్ బాబు ప్రధాన పాత్రలో , మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ "V"మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా సెప్టెంబర్ 5వ తేదీ ప్రపంచవ్యాప్తం గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఫస్ట్ టైమ్ నెగటివ్ రోల్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి నాని ప్రేక్షక , అభిమానుల , విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నారు. "V"మూవీ ని ఆదరించడంతో పాటు తన పెర్ఫార్మెన్స్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్న ప్రేక్షక , అభిమానులకు హీరో నాని కృతజ్ఞతలు తెలిపారు.
'వి' ట్రైలర్ చూసి మహేష్, కృష్ణ గారి రియాక్షన్ అదే
ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో సుధీర్ బాబు నటించిన సినిమా ‘వి’ సినిమా రెలీజ్ కు సిద్ధంగా వుంది. సెప్టెంబర్ 5న ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూ లో సుధీర్ బాబు పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
టాలీవుడ్ లో పూర్తి సంతృప్తిగా ఉన్నా - హీరో నాని
టాలీవుడ్ లో బిజీ హీరో గా కొనసాగుతున్న హీరో నాని తన సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని నటించిన యాక్షన్ థ్రిల్లర్ "V"మూవీ సెప్టెంబర్ 5వ తేదీ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. "V"మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న హీరో నాని తన మనసులో మాట ను వెల్లడించారు. తాను వరుస టాలీవుడ్ మూవీస్ లో నటించాలని అనుకొంటున్నాననీ , పాన్ ఇండియా , బాలీవుడ్ మూవీస్ లో నటించడానికి ఆసక్తి లేదనీ , తాను టాలీవుడ్ మూవీస్ తో పూర్తి సంతృప్తిగా ఉన్నాననీ నాని తెలిపారు.
మీరు చూసింది స్క్రాచ్ మాత్రమే -'V' లో చాలా ఉంది
సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా.. మహేష్ బాబు కు బావగా తెలుగు సినిమా పరిశ్రమలో అడుగుపెట్టిన సుధీర్ బాబు తనకొచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకొని హీరోగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ‘సమ్మోహనం’ తర్వాత ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నటించిన ‘వి’ సినిమా రెలీజ్ కు సిద్ధంగా వుంది. సెప్టెంబర్ 5న ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

'వి' మూవీ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్
ఎక్స్పెక్టేషన్స్కు మ్యాచ్ అవలేదన్న మాట రాకూడదు ఇది 'వి' సినిమా ట్రైలర్ లో నాని చెప్పిన డైలాగ్. మరి నాని చెప్పిన ఎక్స్పెక్టేషన్స్ ను ఈ సినిమా రీచ్ అవుతుందా?లేదా అన్నది ఇంకొన్ని గంటల్లో తెలిసిపోతుంది. మొదట ఈ సినిమాను థియేటర్ లో రిలీజ్ చేద్దామనుకున్నా పరిస్థితులు సహకరించకపోవడంతో ఓటీటీ లోనే రిలీజ్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. ఇక రేపు అమెజాన్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కోసం ఎంతో మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమా ఎందుకు చూడాలో ఒకసారి చూద్దాం.
సత్య దేవ్ నటనపై పవన్ ప్రశంస
చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ.. తనకు వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకొని తన నటనతో ఒక్కో మెట్టు ఎదుగుతూ ఇప్పుడు హీరో స్థాయికి ఎదిగిన టాలెంటెడ్ నటుడు సత్య దేవ్. సత్వ దేవ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఇటీవల ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాలో మరోసారి తన నట విశ్వరూపం చూపించాడు. మలయాళ చిత్రం 'మహేషింటే ప్రతీకారమ్' చిత్రానికి ఇది తెలుగు రీమేక్. ఇక ఈ సినిమా ఇటీవలే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో రిలీజ్ అయి మంచి ప్రశంసలు దక్కించుకుంది.
"V" మూవీ ఆన్ లైన్ ప్రీ రిలీజ్ ఈవెంట్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో హీరోలు నాని , సుధీర్ బాబు ప్రధాన పాత్రలలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ "V" మూవీ సెప్టెంబర్ 5వ తేదీ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ప్రపంచవ్యాప్తం గా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో నివేద థామస్ , అదితి రావు హైదరి హీరోయిన్స్ గా నటించారు. అమిత్ త్రివేది సాంగ్స్ , థమన్ ఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. హీరో నాని సిల్వర్ జూబ్లీ మూవీ గా రూపొందిన "V" మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
పర్యావరణ పరిరక్షణకై రష్మిక సందేశం
టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న "పుష్ప " మూవీ లో కథానాయిక గా నటిస్తున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ రష్మిక అభిమానులను అలరిస్తున్నారు. వర్కౌట్స్ , ఫుడ్ , బ్యూటీ టిప్స్ , స్టూడెంట్స్ కు సలహాలు ఇస్తూ రష్మిక అభిమానులను ఎడ్యుకేట్ చేస్తున్నారు. ఇప్పుడు రష్మిక పర్యావరణ పరిరక్షణకై అభిమానులకు సందేశం ఇచ్చారు.
హైదరాబాద్ లో భారీ సెట్
హీరో నాని ప్రస్తుతం సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "టక్ జగదీష్ "మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా ఈ మూవీ షూటింగ్ నిలిచిపోయింది. ఈ మూవీ తరువాత హీరో నాని మరో రెండు మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హీరో నాని సిల్వర్ జూబ్లీ మూవీ గా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ "V" మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా సెప్టెంబర్ 5వ తేదీ రిలీజ్ కానుంది.
ఓటీటీ రిలీజ్ పై నాని - ఎవరో ఒకరు ధైర్యంగా స్టెప్ తీసుకోవాలి
ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'వి' సినిమా ఓటీటీ లో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే కదా. వచ్చే నెల సెప్టెంబర్ 5న ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేయనున్నారు. ఇక ఓటీటీ లో తెలుగులో ఇప్పటివరకూ అన్నీ చిన్న సినిమాలే వచ్చాయి. ఇప్పటిదాకా ‘వి’ స్థాయి సినిమా ఏదీ నేరుగా ఓటీటీలో రిలీజ్ కాకపోవడంతో ఈ సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై ఇంకా అంచనాలు పెరిగిపోయాయి.

"V" మూవీ సాంగ్ రిలీజ్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో నాని , సుధీర్ బాబు హీరోలుగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ "V" మూవీ ప్రముఖ OTT అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా సెప్టెంబర్ 5వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. నివేద థామస్ , అదితి రావు హైదరి కథానాయికలు. అమిత్ త్రివేది సాంగ్స్ స్వరపరచగా, థమన్ ఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ "V" మూవీ పై అంచనాలను పెంచాయి.