బిగ్ స్టార్స్ తో చేయడం నా డ్రీం కాదు

I Never Want To Do Movies With Big Stars Says Director Mohana Krishna Indraganti

సాధారణంగా ఏ డైరెక్టర్ అయినా పెద్ద పెద్ద స్టార్స్ తో చేయాలన్న డ్రీం ఉంటుంది. కానీ నాకు అలాంటి డ్రీం ఏం లేదు.. టాలెంటెడ్ నటీ నటులను సినిమాకు పరిచయం చేయడమే తన డ్రీం అంటున్నాడు. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో కాదు సహజత్వానికి దగ్గరగా సినిమాలు తీసే ఇంద్రగంటి మోహన్ కృష్ణ. మరి ఇంద్రగంటి సినిమాలు చూస్తేనే చెప్పొచ్చు తను ఇలాంటి వ్యాఖ్యలు చేయడంలో ఎలాంటి తప్పు లేదని. తాజాగా ‘దితెలుగుఫిలింనగర్.కామ్’ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు ఇంద్రగంటి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా మీరు నాని, సుధీర్ లతోనే సినిమాలు ఎక్కువ చేస్తున్నారు అని ఎవరైనా అంటే మీరు ఎలా ఫీల్ అవుతారు అన్న ప్రశ్నకు నిజానికి నేను ఇలాంటివి అస్సలు పట్టించుకోను.. ఒక ఫిలిం మేకర్ గా ఒకసారి పనిచేసిన నటుడితోనే మళ్లీ పని చేస్తున్నాం అంటే.. ఆ నటుడితో బాండింగ్.. వర్క్ చేయడం ఈజీ అని. నేను ఇప్పటివరకూ 25 సినిమాలు చేసాను.. వాటిలో నానితో మూడు సినిమాలు చేశా.. సుధీర్ తో 2, నివేద, అదితి తో 2 సినిమాలు చేసాను.. నేను చాలా మంది టాలెంటెడ్ నటీనటులను పరిచయం చేశాను.. ఏదో పెద్ద స్టార్స్ తోనే సినిమాలు చేయాలన్నది నా డ్రీం కాదు… గ్రేట్ టాలెంట్స్ ను సినిమాకు పరిచయం చేయాలన్నదే నా ఆలోచన ..ఇప్పుడు ‘వి’ సినిమా తర్వాత కూడా నేను బిగ్ స్టార్స్ తో చేయాలనుకోవడం లేదు… చిన్న సినిమాలే కామెడీ కానీ రొమాంటిక్ ఎంటర్ టైనర్ లోనే చేస్తాను అని తెలిపారు.

ఇంకా థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కాపీ కొట్టాడు అన్న కామెంట్స్ పై కూడా మాట్లాడుతూ.. ఈ జోనర్ లో సినిమాలకు ఇలాంటి మ్యూజిక్కే ఉంటుంది.. తమిళ్ తో పోల్చుకుంటే మన తెలుగు వాళ్లకు మ్యూజిక్ నాలెడ్జ్ కొంచం తక్కువే.. మన కల్చర్ లో మ్యూజిక్ ను నేర్పించడం చాలా తక్కువ.. ఒకే రకమైన మ్యూజిక్ ను వింటాం అందుకే కాపీ అని అంటారు.. ‘వి’ సినిమా విషయంలో కూడా అదే జరిగింది. మ్యూజిక్ డైరెక్టర్స్ ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటూనే వున్నారు. కానీ అది నిజంకాదు.. థమన్ చాలా టాలెంటెడ్ వేరే సినిమా నుండి మ్యూజిక్ ను తీసుకోవాల్సిన పని లేదు.. ఇప్పుడున్న టెక్నాలజీతో అలాంటిది చేసినా కనిపెట్టడం చాలా ఈజీ అని ఇంద్రగంటి చెప్పారు.

కాగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో నాని-సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో ‘వి’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే కదా. నివేదా థామస్, అదితి రావ్ హైదరీ హీరోయిన్లుగా నటించారు. సెప్టెంబర్ 5న ఈ సినిమా అమెజాన్ లో రిలీజ్ అయి ప్రశంసలు దక్కించుకుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్‌, హ‌ర్షిత్ రెడ్డి రూపొందించిన ఈ సినిమాకు అమిత్ త్రివేది సంగీతం అందించగా…థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + two =