“ఝుమ్మంది నాదం ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పంజాబీ బ్యూటీ తాప్సీ తెలుగు , తమిళ భాషలలో పలు సూపర్ హిట్ చిత్రాలలో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సూపర్ హిట్ “ఛష్మే బద్దూర్ ” మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయిన తాప్సీ సూపర్ హిట్ ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాప్సీ ప్రస్తుతం “హసీనా దిల్ రుబా “, “శభాష్ మిథు “(హిందీ ), “జనగణమన ” తమిళ మూవీ లో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




దక్షిణాది భాషలలో ఛాన్స్ వస్తే వదులుకోనని చెప్పిన తాప్సీ ఇప్పుడు మరో తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఫ్యాషన్ స్టూడియోస్ బ్యానర్ పై దీపక్ సుందర్ రాజన్ దర్శకత్వంలో తాప్సీ ప్రధాన పాత్రలో ఒక కామెడీ థ్రిల్లర్ తమిళ మూవీ రూపొందుతుంది. ఈ మూవీ లో తాప్సీ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. హీరో విజయ్ సేతుపతి ఒక ప్రత్యేక అతిథి పాత్రలో నటిస్తున్నారు. రాధిక శరత్ కుమార్ , యోగిబాబు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ప్రస్తుతం జైపూర్ (రాజస్థాన్ ) లో ఈ మూవీ చిత్రీకరణ జరుగుతుంది. విజయ్ సేతుపతి షూటింగ్ లో జాయిన్ అయ్యారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: