రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ “భలే భలే మగాడివోయ్ “

Comedy Entertainer Bhale Bhale Magadivoy Completes 5 Years

హీరో నాని తాను నటించే మూవీస్ లో తన దైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. యు వి క్రియేషన్స్ , GA 2 పిక్చర్స్ బ్యానర్స్ పై నాని , లావణ్య త్రిపాఠి జంటగా రూపొందిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ “భలే భలే మగాడివోయ్ ” మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మురళి శర్మ , నరేష్ , వెన్నెల కిషోర్ , అజయ్ ముఖ్య పాత్రలలో నటించారు. గోపిసుందర్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో నాని నుండి ప్రేక్షకులు కోరుకునే విధంగా క్లీన్ కామెడీ తో రూపొందిన “భలే భలే మగాడివోయ్ ” మూవీ ఆద్యంతం ప్రేక్షకులను అలరించింది. ఒక విషయాన్ని మర్చిపోయి మరో విషయంలోకి వెళ్ళిపోయే మతిమరుపు క్యారెక్టర్ లో నాని అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి , ప్రేక్షకులను అలరించి బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ క్రిటిక్స్ అవార్డ్ అందుకున్నారు. “భలే భలే మగాడివోయ్ ” మూవీ కన్నడ , తమిళ భాషలలో రీమేక్ అయ్యింది. బ్లాక్ బస్టర్ “మరోచరిత్ర ” మూవీ లోని సాంగ్ టైటిల్ గా రూపొందిన “భలే భలే మగాడివోయ్ ” మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + 10 =