2007 నుండే నా మైండ్ లో ఉంది – ఇంద్రగంటి

V Movie Story Is On My Head Since 2007 Says Director Mohana Krishna Indraganti

ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో నాని-సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో ‘వి’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే కదా. సెప్టెంబర్ 5న ఈ సినిమా అమెజాన్ లో రిలీజ్ అయిన సంగతి కూడా విదితమే. ఇంద్రగంటి యాక్షన్ సినిమాలు తీయడం మొదటిసారి కావడంతో ఈ సినిమా తీసిన విధానంపై ఈ సినిమాకు మంచి ప్రశంసలే దక్కాయి. ఇక ఈ సందర్భంగా ‘దితెలుగుఫిలింనగర్.కామ్’ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘వి’ లాంటి యాక్షన్ సినిమా తీయడానికి మీకు ప్రేరేపించిన విషయం ఏంటని అడుగగా దానికి ఇంద్రగంటి.. నిజానికి ప్రేరేపించిన విషయం అంటూ ఏమి లేదు.. నాకు ఈ జోనర్ సినిమాలు అంటే ఎప్పుడూ ఇష్టమే.. వార్ ఫిలిమ్స్ అంటే నాకు చాలా ఇష్టం.. అమితాబ్, శశి కపూర్ ల దేవార్, త్రిశూల్, డాన్ సినిమాలకు నేను పెద్ద ఫ్యాన్స్ ని.. కాప్స్ వర్సెస్ గ్యాంగ్ స్టర్స్.. పోలీస్ వర్సెస్ క్రిమినల్స్
సినిమాల్లో స్టైల్ కంటే కంటెంట్ అంటే నాకు ఎక్కువ ఇంట్రెస్ట్. అందుకే నేను కూడా ఇదే జోనర్ ఎందుకు ట్రై చేయకూడదు అని ఆలోచించాను అని చెప్పాడు. ఈ ‘వి’ స్టోరీ ఇప్పుడు కాదు 2007 నుండే గ్రహణం కంటే ముందే నా మైండ్ లో ఉంది.. ఈ విషయం నా ఫ్రెండ్స్ కు కూడా తెలుసు.. అసలు థ్రిల్లర్ స్టోరీతోనే నేను నా మొదటితో ఎంట్రీ ఇవ్వాలనుకున్నా.. అప్పట్లో చాలా మందిని కలిశా కూడా కానీ వర్క్ అవుట్ కాలేదు అని చెప్పాడు. నేను గ్రహణం సినిమా తీయడం.. నేషనల్ అవార్డ్ రావడం జరిగాయి. ఆ తర్వాత నా ఫెవరెట్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి ఫోన్ చేసి ఇది ఆర్ట్ మూవీ కాదు.. ఇది థ్రిల్లర్ మూవీ.. ఇంకా థ్రిల్లర్ మూవీస్ చాలా తీయొచ్చు అని చెప్పారు. అప్పటినుండి అనుకుంటూనే ఉన్నా.. అయితే నా చివరి సినిమా తర్వాత జోనర్ ని మార్చాలని అనుకున్నా.. కామెడీ, రొమాన్స్ తీసే ఆలోచన లేదు.. అందుకే యాక్షన్ థ్రిల్లర్ చేశా అని ఇంద్రగంటి చెప్పాడు.

కాగా నివేదా థామస్, అదితి రావ్ హైదరీ హీరోయిన్లుగా నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్‌, హ‌ర్షిత్ రెడ్డి రూపొందించిన ఈ సినిమాకు అమిత్ త్రివేది సంగీతం అందించగా…థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − ten =