టాలీవుడ్ లైన్ ప్రొడ్యూసర్ , ఫారిన్ షూట్ కో- ఆర్డినేటర్ గోపీకృష్ణ నర్రావుల కు సూపర్ స్టార్ మహేష్ బాబు అభినందనలు తెలిపారు. “బజార్ రౌడీ “(1988 ) మూవీ తో లైన్ ప్రొడ్యూసర్ గా మారిన గోపికృష్ణ మహేష్ బాబు నటించిన అనేక సూపర్ హిట్ మూవీస్ కు పని చేశారు . చిరంజీవి (సైరా నరసింహా రెడ్డి ), పవన్ కళ్యాణ్ (గబ్బర్ సింగ్ , అత్తారింటికి దారేది ), ఎన్టీఆర్ (నాన్నకు ప్రేమతో ), ప్రభాస్ (మిర్చి ) మూవీస్ కు వర్క్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
బ్లాక్ బస్టర్ “అల .. వైకుంఠ పురములో .. ” మూవీ గోపీకృష్ణకు లైన్ ప్రొడ్యూసర్ గా 99 వ మూవీ. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న “సర్కారు వారి పాట గోపీకృష్ణకు 100వ మూవీ కావడం విశేషం. లైన్ ప్రొడ్యూసర్ గా గోపీకృష్ణ 100 మూవీస్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా అంకిత భావంతో కష్టపడి పనిచేసే గోపీకృష్ణ తో అనేక స్వీట్ మెమొరీస్ ఉన్నాయని , అల్ ది బెస్ట్ అంటూ మహేష్ బాబు గోపీకృష్ణకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: