శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నాని , సుధీర్ బాబు ప్రధాన పాత్రలో , మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ “V”మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా సెప్టెంబర్ 5వ తేదీ ప్రపంచవ్యాప్తం గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఫస్ట్ టైమ్ నెగటివ్ రోల్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి నాని ప్రేక్షక , అభిమానుల , విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నారు. “V”మూవీ ని ఆదరించడంతో పాటు తన పెర్ఫార్మెన్స్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్న ప్రేక్షక , అభిమానులకు హీరో నాని కృతజ్ఞతలు తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




హీరో నాని మాట్లాడుతూ .. తనపై ఇంతటి ప్రేమ , ఆదరణ లభిస్తుందని 12 సంవత్సరాల క్రితం తన మొదటి మూవీ రిలీజ్ అయినప్పుడు ఊహించలేదనీ , మొదటి సారి నెగటివ్ రోల్ లో నటించినప్పటికీ అభిమానులు తనను ఎంతగానో ఆదరించారనీ , తన 25 వ సినిమా పై అభిమానం చూపించిన అందరికీ కృతజ్ఞతలనీ , తన తోటి నటీనటులు సుధీర్ బాబు , నివేద థామస్ , అదితి రావు హైదరి , అమెజాన్ ప్రైమ్ సంస్థకు హీరో నాని థ్యాంక్స్ చెప్పారు. ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందిన “అష్టా చమ్మా ” మూవీ తో నాని హీరో గా పరిచయం అవడం , నాని 25 వ మూవీ కి ఇంద్రగంటి దర్శకత్వం వహించడం విశేషం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: