కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

పర్యావరణ పరిరక్షణకై రష్మిక సందేశం

పర్యావరణ పరిరక్షణకై రష్మిక సందేశం

Actress Rashmika Mandanna Urges Everyone To Use Environmentally Friendly Products

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న "పుష్ప " మూవీ లో కథానాయిక గా నటిస్తున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ రష్మిక అభిమానులను అలరిస్తున్నారు. వర్కౌట్స్ , ఫుడ్ , బ్యూటీ టిప్స్ , స్టూడెంట్స్ కు సలహాలు ఇస్తూ రష్మిక అభిమానులను ఎడ్యుకేట్ చేస్తున్నారు. ఇప్పుడు రష్మిక పర్యావరణ పరిరక్షణకై అభిమానులకు సందేశం ఇచ్చారు.

స్టార్ హీరోయిన్ రష్మిక తన లేటెస్ట్ ఫొటోను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసి, తాను పచ్చదనాన్ని , ప్రకృతిని ప్రేమిస్తానని అందరికీ తెలిసిన విషయమే ననీ , పర్యావరణాని కై కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాననీ , ఇప్పుడు తాను ధరించిన డ్రెస్ రీ సైకిల్డ్ అనీ , తనకు చాలా నచ్చిందనీ , పర్యావరణానికై మంచిపని చేశాననీ , మనమంతా రీ సైకిల్ , రీ యూజ్ , రెడ్యూస్ వంటి ప్రయత్నాలు చేసి పర్యావరణ పరిరక్షణ చేద్దామనీ రష్మిక అభిమానులకు సందేశం ఇచ్చారు. దాదాపు 5నెలలపాటు కూర్గ్ లోని తన స్వంత ఇంటిలో కుటుంబ సభ్యులతో టైమ్ స్పెండ్ చేసిన రష్మిక హైదరాబాద్ కు చేరుకున్నారు.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్