‘వి’ మూవీ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్

Remove term: Reasons To Watch V The Movie Reasons To Watch V The Movie

ఎక్స్‌పెక్టేష‌న్స్‌కు మ్యాచ్ అవ‌లేద‌న్న‌ మాట రాకూడ‌దు ఇది ‘వి’ సినిమా ట్రైలర్ లో నాని చెప్పిన డైలాగ్. మరి నాని చెప్పిన ఎక్స్‌పెక్టేష‌న్స్ ను ఈ సినిమా రీచ్ అవుతుందా?లేదా అన్నది ఇంకొన్ని గంటల్లో తెలిసిపోతుంది. మొదట ఈ సినిమాను థియేటర్ లో రిలీజ్ చేద్దామనుకున్నా పరిస్థితులు సహకరించకపోవడంతో ఓటీటీ లోనే రిలీజ్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. ఇక రేపు అమెజాన్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కోసం ఎంతో మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమా ఎందుకు చూడాలో ఒకసారి చూద్దాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విలన్ గా నాని.. ముందుగా ఈ సినిమాపై ఇంత ఇంట్రెస్ట్..రావడానికి మెయిన్ రీజన్ నాని నెగిటివ్ షేడ్ లో నటించడమే. జెంటిల్ మెన్ లో మనకు ఆ ఛాయలు కనిపించినా ఈ సినిమాలో మాత్రం నాని పూర్తిగా డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు.

పోటా-పోటీ..ఇక నాని- సుధీర్ బాబు కాంబినేషన్.. ట్రైలర్ లో చూస్తే నటనలో ఇద్దరూ ఎక్కడ తగ్గలేదు అన్నట్టే కనిపిస్తుంది. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో సుధీర్ బాబు.. కిల్లర్ పాత్రలో నాని ఇరగదీసారు. తెర‌పై ఎంత‌మంది ఉన్నా అంద‌రినీ డామినేట్ చేసేస్తాడు నాని. అలాంటి చోట‌… త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త నిలుపుకోవ‌డం ఏ హీరోకైనా క‌ష్ట‌మే. కానీ `వి` ట్రైల‌ర్ చూస్తుంటే… సుధీర్ బాబు మాత్రం నానికి ధీటుగా చేసినట్టు కనిపిస్తుంది.

సూపర్ రెస్పాన్స్.. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ లకు మంచి రెస్పాన్స్ రావడం.. థ్రిల్లింగ్ అండ్ సస్పెన్స్ ఎలిమెంట్స్ తోపాటు ఈ సారి యాక్షన్ ఎలిమెంట్స్ పై కూడా ఇంద్రగంటి ఫుల్ ఫోకస్ చేసినట్టే కనిపిస్తుంది.

కాంబినేషన్… ఇంద్రగంటి -నాని కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా.. సమ్మోహం తర్వాత ఇంద్రగంటి-సుధీర్ బాబు-అదితి కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా, నాని-నివేద కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా ఇలా హిట్ కాంబినేషన్ తో వస్తున్న సినిమా కాబట్టి సినిమాపై ఇంకా ఆసక్తి నెలకొంది.

నాని సిల్వర్ జూబ్లీ మూవీ.. తన కెరీర్‌కు ప్రాణం పోసిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో 25వ సినిమా కూడా చేస్తున్నాడు నేచురల్ స్టార్. ఈ కాంబినేషన్‌లో వచ్చిన అష్టా చమ్మా, జెంటిల్ మెన్ సినిమాలు విజయం సాధించాయి. ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టడానికి రెడీ అవుతున్నాడు. అంతేకాదు నాని అష్టా చమ్మా-వి సినిమా రిలీజ్ డేట్ ఒకటే అవ్వడం యాదృచ్చికం.

క్లైమాక్స్‌.. ఈ సినిమా క్లైమాక్స్ లో సూపర్ ట్విస్ట్ ఉండనుందట. ఇంద్రగంటి క్లైమాక్స్ ను అదిరిపోయే రేంజ్ లో డిజైన్ చేసాడట. ఈ ట్విస్ట్ కానీ కరెక్టుగా వర్కవుట్ అయిందంటే వి రేంజ్ మారిపోవడం కూడా ఖాయమంటున్నారు.

డేరింగ్ స్టెప్.. ఒక రకంగా ఓటీటీ రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ డేరింగ్ స్టెప్పే తీసుకుంది. ఇంత మంచి సినిమాని థియేటర్‌లో చూస్తే బావుండేదే అనిపిస్తుంది. కానీ, తప్పదు. థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయో తెలియదు. ఒక రకంగా చెప్పాలంటే ఈ టైమ్‌లో ‘వి’ సినిమాను ఓటీటీలో విడుదల చేయడం మంచి నిర్ణయమే. ఈ సినిమా ఎన్నో సినిమాలకు.. ఓటీటీ లో రిలీజ్ చేయాలా?వద్దా? అని సందిగ్ధంలో ఉన్న వాళ్లకు ధైర్యం ఇస్తుందని చెప్పొచ్చు.

కాగా ఇంద్రగంటి దర్శకత్వంలో నాని,సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో ..నివేదా థామస్, అదితి రావ్ హైదరీ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో.. జగపతిబాబు, నాజర్, వెన్నెల కిశోర్, శ్రీనివాస్ అవసరాల కీలక పాత్రల్లో నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్‌, హ‌ర్షిత్ రెడ్డి రూపొందిస్తున్న ఈ సినిమాకు అమిత్ త్రివేది సంగీతం అందించగా…థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.