మీరు చూసింది స్క్రాచ్ మాత్రమే -‘V’ లో చాలా ఉంది

V Movie Is A Perfect Feast For Movie Lovers

సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా.. మహేష్ బాబు కు బావగా తెలుగు సినిమా పరిశ్రమలో అడుగుపెట్టిన సుధీర్ బాబు తనకొచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకొని హీరోగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ‘స‌మ్మోహ‌నం’ త‌ర్వాత ఇంద్రగంటి మోహనకృష్ణ ద‌ర్శక‌త్వంలో నటించిన ‘వి’ సినిమా రెలీజ్ కు సిద్ధంగా వుంది. సెప్టెంబ‌ర్ 5న ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుద‌ల‌వుతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నాని, నివేద, అదితి తో ఇంతకుముందే నటించారు కదా.. ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఉపయోగపడిందా అని అడుగగా.. నిజానికి ఈ ప్రాజెక్ట్ నాని, నేను, నివేద, అదితి అని సెట్ అవ్వలేదు అని అనుకుంటున్నా.. స్క్రిప్ట్ ను బట్టి పాత్రలను ఎంచుకోవడం జరిగింది. ఇక మంచి నటీనటులు వున్నప్పుడు నటించడం ఈజీ.. ఇంకా ఇంద్రగంటి గారి వర్కింగ్ స్టైల్ తెలిసిన తర్వాత ఆయనతో నటించడం చాలా ఈజీ.. ఎంతైనా రెండోసారి నటించేటప్పుడు టెన్షన్, ప్రెషర్ ఉండదు.. కంఫర్ట్ ఉంటుంది అని తెలిపాడు.

ఇక ఈ సినిమా చూస్తుంటే యాక్షన్ ప్యాక్డ్ లాగా అనిపిస్తుంది అన్న ప్రశ్నకు.. సినిమాలో యాక్షన్‌, డ్రామాకు మంచి స్పేస్ కుదిరింది. టీజర్, ట్రయిలర్ లలో చూసింది స్క్రాచ్ మాత్రమే.. ఇంకా ఈ సినిమాలో చాలా ఉంది. యాక్షన్ సీన్స్ ఏదో పెట్టినట్టు కాకుండా.. స్టంట్స్, రోప్ తో ఉండే యాక్షన్ సన్నివేశాలు అన్నీ స్క్రిప్ట్ ను బట్టే ఉంటాయి. అనవసరమైన యాక్షన్ సీన్స్ ఏం ఉండవు.. మంచి కథతో పాటు.. యాక్షన్ సీక్వెన్స్ ను మంచిగా బ్యాలన్స్ చేసిన సినిమా ఇది అని చెప్పొచ్చు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + twelve =