‘వి’ ట్రైలర్ చూసి మహేష్, కృష్ణ గారి రియాక్షన్ అదే

Sudheer Babu Talks About The Reaction Of Super Star Krishna and Mahesh Babu After Watching V Movie Trailer

ఇంద్రగంటి మోహనకృష్ణ ద‌ర్శక‌త్వంలో సుధీర్ బాబు నటించిన సినిమా ‘వి’ సినిమా రెలీజ్ కు సిద్ధంగా వుంది. సెప్టెంబ‌ర్ 5న ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుద‌ల‌వుతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూ లో సుధీర్ బాబు పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వి ట్రయిలర్ చూసి మహేష్ బాబు, కృష్ణ గార్ల రియాక్షన్ ఏంటి అని అడుగగా.. నార్మల్ గా మహేష్ కు ఫస్ట్ డేనే సినిమా చూడటం అలవాటు.. నా సినిమాలు కూడా చూసేవారు.. ఈ సినిమా ట్రైలర్ తర్వాత మహేష్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందా అని వెయిట్ చేసాను.. ట్రైలర్ చూసిన తర్వాత యాక్షన్ సీక్వెన్స్ చాలా బావున్నాయని.. చాలా డిఫరెంట్ గా ఉన్నాయని అన్నారు. త‌న‌కు ఇంద్రగంటి గారంటే చాలా మంచి ఓపినియ‌న్ ఉంది. ‘సమ్మోహనం’ సమయంలో ఆ విష‌యాన్ని నాకు చెప్పారు. ‘వి’ సినిమా కోసం త‌ను ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నట్లు కూడా చెప్పారు మ‌హేష్. ఇక కృష్ణ గారు కూడా ట్రయిలర్ చూసి ఈ సినిమాతో యాక్షన్ ఇమేజ్ వస్తుందని చెప్పారు. సినిమా ప్రమోషన్స్ బాగా జరిగినా జరగపోయినా ఆయనకు తెలుసు.. నార్మల్ గా చూసి చెప్పేయగలరు.

ఇక ఇప్పటి వరకూ ఈ సినిమాలో నాని సైకో కిల్లర్ గా.. సుధీర్ బాబు పాత్రలో.. నివేదా థామస్ అపూర్వ పాత్రలో.. క్రైమ్ న‌వ‌లా ర‌చ‌యిత గా నటిస్తున్న విషయం చెప్పేసారు.. అయితే అదితి రోల్ మాత్రం ఇంతవరకూ రివీల్ చేయలేదు. ఇక ఇదే విషయాన్ని సుధీర్ బాబు ను అడుగగా.. ఈ సినిమాలో అదితిది చాలా ముఖ్యమైన పాత్ర.. కావాలనే అదితి పాత్రను మేము చూపించలేదు ఇప్పటివరకూ.. మీరు ఒకసారి సినిమా చూశారంటే అర్ధమవుతది మేము ఎందుకు చూపించలేదో. మరి అదితి పాత్ర ఏంటో తెలియాలంటే ఇంకొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − fifteen =