
ట్యాగ్ · 28 కథనాలు


2024 సంక్రాంతి రేసులో పవన్?

గ్రాండ్ గా ప్రారంభం కానున్న #NANI 30

వీర సింహారెడ్డి మూవీ పై తలైవా రజనీకాంత్ ప్రశంసలు

శ్రీనివాస మూర్తి మృతిపై సూర్య ఎమోషనల్ పోస్ట్

నాని 30 ఓపెనింగ్ డేట్ ఫిక్స్

పవన్ - సుజీత్ మూవీ క్రేజీ అప్ డేట్

విషమంగానే తారకరత్న ఆరోగ్యం

తారకరత్న హెల్త్ అప్ డేట్

బుట్టబొమ్మ ట్రైలర్ రిలీజ్

ఇండియన్ 2 కోసం ఆర్ఆర్ఆర్ ఆస్కార్ కొరియోగ్రాఫర్

స్టైలిష్ లుక్ లో మెగాస్టార్ చిరంజీవి

షూటింగ్ చివరి దశలో మార్క్ అంథోని

విజయ్ తో డేటింగ్ రష్మిక క్లారిటీ

అలనాటి నటి జమున కన్నుమూత

క్రిటికల్ కండిషన్ లో
నందమూరి తారక రత్న ఆకస్మిక గుండెపోటు కి గురైన సంగతి తెలిసిందే. నందమూరి తారకరత్నకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. అయితే తన కండిషన్ మొదటి మూడు రోజుల్లో కాస్త సీరియస్ గా మారగా ఆయన కుటుంబీకులు అంతా కూడా బెంగళూరు కి వెళ్లారు. అయితే నిన్ననే ఎట్టకేలకు ఆయన ఆరోగ్యంపై శుభవార్త బయటకి రావడంతో అభిమానులు మరియు సినీ వర్గాల వారు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

2024 సంక్రాంతి రేసులో పవన్?
ఈ ఏడాది సంక్రాంతి అయిపోయింది. సంక్రాంతికి బరిలో దిగిన రెండు తెలుగు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ తో దూసుకుపోతున్నాయి. ఇక అప్పుడే వచ్చే ఏడాది సంక్రాంతికి పోటీ వచ్చేస్తుంది. ఇప్పటికే రామ్ చరణ్ ఆర్సీ 15 సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి బరిలో దిగనున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఆలిస్ట్ లో చేరిపోయినట్టు కనిపిస్తుంది. వకీల్ సాబ్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి సాలిడ్ రీఎంట్రీ కొట్టిన పవన్. ఆ తరువాత భీమ్లానాయక్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ప్రస్తుతం పవన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుంది హ్యాట్రిక్ హిట్ కోసం. ఈ హిట్ కోసం ఎన్నో రోజుల నుండి ఆసక్తిగా…

గ్రాండ్ గా ప్రారంభం కానున్న #NANI 30
విభిన్న కథా చిత్రాలలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న న్యాచురల్ స్టార్ నాని మరో డిఫరెంట్ స్టోరీతో తెరకెక్కుతున్న దసరా మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో హీరో నాని, కీర్తి సురేష్ జంటగా సింగరేణి కోల్ మైన్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ దసరా మూవీ మార్చి 30 వ తేదీ రిలీజ్ కానుంది. దసరా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

వీర సింహారెడ్డి మూవీ పై తలైవా రజనీకాంత్ ప్రశంసలు
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా వాస్తవ సంఘటనలతో రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ వీరసింహారెడ్డి మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి, విజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటించారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. వీరసింహారెడ్డి మూవీలో వీర సింహారెడ్డిగా, జయసింహా రెడ్డిగా రెండు పాత్రల్లో అద్భుతంగా నటించిన హీరో బాలకృష్ణ ప్రేక్షక, అభిమానులను ఆకట్టుకున్నారు. కొన్ని ఎమోషనల్…

శ్రీనివాస మూర్తి మృతిపై సూర్య ఎమోషనల్ పోస్ట్
ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి నిన్న మృతి చెందిన సంగతి తెలిసిందే కదా. నిన్న ఆయనకు హార్ట్ ఎటాక్ రావటంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. అయితే పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. ఇక శ్రీనివాస మూర్తి మృతిపై తమిళ్ స్టార్ హీరో సూర్య ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ నివాళులు అర్పించారు. ఇది వ్యక్తిగతంగా నాకు పెద్ద నష్టం. తెలుగులో నా నటనకు శ్రీనివాసమూర్తి గారి గాత్రం, భావోద్వేగాలు ప్రాణం పోశాయి. మీరు మా అందరి నుండి ఇంత త్వరగా దూరమవ్వడం బాధాకరం, మీరు పవిత్రాత్మకు శాంతి కలగాలి అంటూ సూర్య పెట్టిన ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. మరి సూర్యకు తెలుగులో డబ్బింగ్…

నాని 30 ఓపెనింగ్ డేట్ ఫిక్స్
న్యాచురల్ స్టార్ నాని కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం నాని చేస్తున్న సినిమా దసరా. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. మరోవైపు నాని తన 30 వ సినిమాను కూడా మొదలుపెట్టనున్నట్టు తెలుస్తుంది. న్యూ ఇయర్ సందర్భంగా ఈసినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. నూతన దర్శకుడు శౌర్యువ్ ఈసినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. తండ్రీకూతుళ్ల మధ్య అందమైన బంధాన్ని చూపించే హార్ట్ టచింగ్ వీడియో ద్వారా సినిమాలో నాని వరల్డ్ ని కూడా మేకర్స్ రివిల్ చేశారు. గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇదిలా ఉండగా ఈసినిమా ఓపెనింగ్ కు డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఈసినిమా ప్రారంభ పూజా…

పవన్ - సుజీత్ మూవీ క్రేజీ అప్ డేట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా రీఎంట్రీ తరువాత ఒక సినిమా తరువాత మరో సినిమాను చేసుకుంటూ వెళుతున్నారు. ఒక పక్క రాజకీయాలతో బిజీగా ఉన్నా కూడా షూటింగ్ లలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం అయితే తను చేస్తున్న సినిమా హరిహర వీరమల్లు. క్రిష్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇక ఈసినిమా తో పాటు పవన్ హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే కదా. వీరిద్దరి కాంబినేషన్ కోసం కూడా అభిమానులు ఎప్పటినుండో వెయిట్ చేస్తున్నారు. త్వరలోనే ఈసినిమా షూటింగ్ ను కూడా మొదలుపెట్టనున్నట్టు తెలుస్తుంది.

విషమంగానే తారకరత్న ఆరోగ్యం
నందమూరి తారకరత్న నిన్న గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే కదా. లోకేష్ మొదలుపెట్టిన ‘యువగళం’ పాదయాత్ర కార్యక్రమంలో తారకరత్న పాల్గొన్నారు. నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్ మరియు టీడీపీ కార్యకర్తలతో కలిసి పాదయాత్రలో ముందుకు నడిచాడు. అయితే కొంత సమయానికి నడుస్తూ నడుస్తూ తారకరత్న ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయాడు. అతనిని వెంటనే అక్కడి నుంచి కుప్పంలోని హాస్పిటల్ కి తరలించారు కార్యకర్తలు. అయితే అప్పటికే పల్స్ పడిపోవడంతో డాక్టర్లు సీపీఆర్ చేసి పల్స్ వచ్చేటట్లు చేశారు. అయితే అనంతరం పరిస్థితి విషమంగానే ఉండటంతో తారకరత్నను బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో తరలించారు. ప్రస్తుతం అక్కడే చికిత్స పొందుతున్నారు.

దసరా మూవీ రెండు పార్ట్స్ రూమర్స్ పై హీరో నాని క్లారిటీ
శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో హీరో నాని, కీర్తి సురేష్ జంటగా సింగరేణి కోల్ మైన్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ దసరా మూవీ మార్చి 30 వ తేదీ రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో సాయి కుమార్, సముద్ర ఖని, జరీనా వాహబ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానున్న దసరా మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. హీరో నాని, కీర్తి సురేష్ జంటగా తెరకెక్కిన నేను లోకల్ మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.

తారకరత్న హెల్త్ అప్ డేట్
నందమూరి తారకరత్న అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం టీడీపీ యువనేత, చంద్రబాబు తనయుడు లోకేష్ యువగళం పేరుతో పాదయాత్రను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈకార్యక్రమంలో తారకరత్న కూడా పాల్గొన్నారు. అయితే అక్కడే పాదయాత్ర చేస్తున్న సమయంలోనే తారకరత్న కు మైల్డ్ స్ట్రోక్ రావడంతో వెంటనే కుప్పంలోని ఆస్పత్రికి తరలించారు. కుప్పం పీఈఎస్ సూపర్ స్పెషాలిటీస్ ఆసుపత్రిలో చికిత్స చేశారు.

బుట్టబొమ్మ ట్రైలర్ రిలీజ్
విశ్వాసం ఫేమ్ అనికా సురేంద్రన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. బాలనటిగా ఎన్నో సినిమాల్లో నటించిన అనికా ఇప్పుడు హీరోయిన్ గా ప్రధాన పాత్రలో ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకత్వంలో అనికా హీరోయిన్ గా వస్తున్న సినిమా బుట్టబొమ్మ. ఈసినిమా ఫిబ్రవరి 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. దీనిలో భాగంగానే ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, పాటలు సినిమాపై అంచనాలను పెంచేశాయి.

ఇండియన్ 2 కోసం ఆర్ఆర్ఆర్ ఆస్కార్ కొరియోగ్రాఫర్
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంత గుర్తింపు తెచ్చుకుందో తెలిసిందే కదా. ఎన్నో అంతర్జాతీయ అవార్డులను సైతం అందుకుంటుంది. రీసెంట్ గా నాటు నాటు సాంగ్ ఆస్కార్ నామినేషన్లలో సైతం చోటు దక్కించుకుంది. ఇక ఆర్ఆర్ఆర్ కు వచ్చిన గుర్తింపుతో ఆసినిమా టెక్నీషియన్స్ కు కూడా బిజీ అవుతున్నారు. ఈనేపథ్యంలోనే ఆర్ఆర్ఆర్ సినిమా కొరియోగ్రాఫర్ కు ఇండియన్ సినిమాలో ఛాన్స్ దక్కించుకున్నాడు. లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా వస్తున్న సినిమా ఇండియన్ 2. ఈసినిమా భారతీయుడు సినిమాకు ఈసినిమా సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా షూటింగ్ కు వచ్చిన అడ్డంకులు అన్నీ ఇన్నీ…

స్టైలిష్ లుక్ లో మెగాస్టార్ చిరంజీవి
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా తెరకెక్కిన వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా తెలుగు, హిందీ భాషలలో జనవరి 13వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలలో నటించారు. చిరంజీవి, రవితేజ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన ఈ మూవీ అద్భుత స్పందనతో దూసుకుపోతోంది. వాల్తేరు వీరయ్య మూవీ 15 రోజులకు సుమారు 210 కోట్లు గ్రాస్, సుమారు 123 కోట్ల షేర్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది.

సక్సెస్ ఫుల్ గా మూడవ వారంలో వీరసింహారెడ్డి
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా వాస్తవ సంఘటనలతో రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ వీరసింహారెడ్డి మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి, విజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటించారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. వీరసింహారెడ్డి మూవీలో వీర సింహారెడ్డిగా, జయసింహా రెడ్డిగా రెండు పాత్రల్లో అద్భుతంగా నటించిన హీరో బాలకృష్ణ ప్రేక్షక, అభిమానులను ఆకట్టుకున్నారు. కొన్ని ఎమోషనల్…

షూటింగ్ చివరి దశలో మార్క్ అంథోని
తన సినిమాలతో తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా ఎంతోమంది ప్రేక్షకులను సొంతం చేసుకున్నాడు విశాల్. ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ గ్యాప్ లేకుండా బిజీ బిజీగా కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం అయితే పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు విశాల్. ఇటీవలే ఏ వినోద్ కుమార్ దర్శకత్వంలో లాఠీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆసినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు మరో సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మార్క్ అంథోని అనే యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా చేస్తున్నాడు విశాల్. ఈసినిమా షూటింగ్ ఎప్పటినుండో జరుగుతుంది. ఇక తాజా సమచారం ప్రకారం ఈసినిమా చివరి దశకు…

నెట్ ఫ్లిక్స్ లో టాప్ 2 ట్రెండింగ్ లో ధమాకా
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై మాస్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ, పెళ్ళిసందD మూవీ ఫేమ్ శ్రీ లీల జంటగా డబుల్ ఇంపాక్ట్ ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన మాస్ ఎంటర్ టైనర్ మూవీ ధమాకా డిసెంబర్ 23 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్స్ రాబట్టిన విషయం తెలిసిందే. ధమాకా మూవీ లో హీరో రవితేజ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్, గ్లామర్ డాల్ శ్రీలీల డ్యాన్స్ ఆడియెన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. ధమాకా మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్ళు సాధిస్తూ దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు సాధిస్తున్న ఈ చిత్రం యూఎస్ బాక్సాఫీస్ లో కూడా సూపర్ రన్ తో…

విజయ్ తో డేటింగ్ రష్మిక క్లారిటీ
హీరోయిన్స్ కు రూమర్స్ అనేవి కామన్. సోషల్ మీడియా వేదికగా వారిపై ఏదో ఒక రకంగా రూమర్స్ వస్తూనే ఉంటాయి. వారు ఏం మాట్లాడినా.. ఏం చేసినా కొంతమంది అదే పనిగా క్రియేట్ చేయడానికి రెడీ గా ఉంటారు. ఇక హీరోయిన్స్ కు కూడా అది అలవాటయిపోతుంది. మొదట కాస్త వాటివల్ల ఇబ్బంది పడినా ఎక్స్ పీరియన్స్ తో ఎలా హ్యాండిల్ చేయాలో కూడా నేర్చేసుకుంటారు. ముఖ్యంగా వారి వ్యక్తిగత జీవితాలపై పలు వేదిస్తుంటాయి. వారు ఎక్కడికి వెళ్లారు.. ఎవరితో ఉన్నారు లాంటి విషయాలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఇబ్బందులకు గురి చేస్తుంటారు. ఇక స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న కూడా తనపై వచ్చే రూమర్స్ పై స్పందిస్తూ సమాధానం చెబుతూనే…

అలనాటి నటి జమున కన్నుమూత
ఈమధ్య కాలంలో ఎంతో మంది తెలుగు సినీ నటులను కోల్పోయింది సినీ పరిశ్రమ. ఇక గత ఏడాది అయితే సినీ లెజెండరీస్ సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు, నవరస నటనాసార్వభౌముడు సత్య నారాయణ లాంటి దిగ్గజాలు సైతం సినీ లోకాన్ని విడిచి వెళ్లారు. ఇప్పుడు మరో సీనియర్ నటి, అలనాటి నటి జమున కూడా నేడు తుదిశ్వాస విడవడం మరోసారి సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. వయోభారంవల్ల వచ్చే అనారోగ్య సమస్యలతో జమున గత కొంత కాలంగా బాధపడుతున్నారు. ఈనేపథఅయంలో నేడు హైదరాబాద్‌లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఫిలిం ఛాంబర్‌కు జమున పార్థీవ దేహాన్ని తీసుకురానున్నారు. ఆమె మరణవార్త తెలిసి టాలీవుడ్ లో విషాదం అలుముకుంది.

సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రక్షితా రెడ్డి తో హీరో శర్వానంద్ నిశ్చితార్థం
హీరో శర్వానంద్ బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెబుతూ ఓ ఇంటివాడు కాబోతున్నారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రక్షితా రెడ్డితో ఏడడుగులు వేయనున్నారు. ఈ జంట నిశ్చితార్థం గురువారం హైదరాబాద్‌లోని ఓ హోటల్లో వైభవంగా జరిగింది. ఈ వేడుకకు తెలుగు చిత్రసీమలోని పలువురు ప్రముఖులు విచ్చేసి కొత్త జంటకు శుభాకాంక్షలందజేశారు. రక్షిత తండ్రి పసునూర్ మధుసూదన్ రెడ్డి హై కోర్టు లాయర్‌గా ఉన్నారు.

సింగర్ సునీత తనయుడు ఆకాష్ హీరోగా సర్కార్ నౌకరి మూవీ ప్రారంభం
ప్రముఖ సింగర్ సునీత తనయుడు ఆకాష్ హీరోగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. సింగర్ సునీత, మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేని, దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు సహకారంతో ఆకాష్ హీరోగా మారారు. దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు నిర్మాతగా ఆర్.కె టెలీ షో ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై గంగనమోని శేఖర్ దర్శకత్వంలో ఆకాష్, నూతన నటి భావనా వళపండల్ జంటగా సర్కార్ నౌకరి మూవీ తెరకెక్కుతుంది.