న్యాచురల్ స్టార్ నాని కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం నాని చేస్తున్న సినిమా దసరా. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. మరోవైపు నాని తన 30 వ సినిమాను కూడా మొదలుపెట్టనున్నట్టు తెలుస్తుంది. న్యూ ఇయర్ సందర్భంగా ఈసినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. నూతన దర్శకుడు శౌర్యువ్ ఈసినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. తండ్రీకూతుళ్ల మధ్య అందమైన బంధాన్ని చూపించే హార్ట్ టచింగ్ వీడియో ద్వారా సినిమాలో నాని వరల్డ్ ని కూడా మేకర్స్ రివిల్ చేశారు. గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇదిలా ఉండగా ఈసినిమా ఓపెనింగ్ కు డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఈసినిమా ప్రారంభ పూజా కార్యక్రమం జనవరి 31న హైదరాబాద్‌లో జరగనుంది. ఫిబ్రవరి 1 నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాలో సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రాఫర్ గా..హృదయం ఫేమ్‌కు చెందిన ప్రముఖ మలయాళ కంపోజర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈసినిమాను వైరా ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సి.వి.మోహన్, డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల, మూర్తి కె.ఎస్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: