
ట్యాగ్ · 28 కథనాలు · పేజీ 2


మారిన బద్రి మూవీ రీ రిలీజ్ డేట్

హెల్త్ పై విజయ్ ఆంటోని క్లారిటీ

ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్ కు పవన్ కళ్యాణ్ అభినందనలు

మూడు డిఫరెంట్ పాత్రల్లో సుధీర్ బాబు

నాని దసరా టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
కెరీర్ ప్రారంభంనుండి విభిన్నమైన పాత్రలు చేసే హీరోల్లో న్యాచురల్ స్టార్ హీరో నాని కూడా ముందుంటాడు. ఇక నాని కామెడీ యాంగిల్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన కామెడీతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో దిట్ట. అయితే నాని మాస్ రోల్ లో చాలా తక్కువ పాత్రలే చేశాడు. కానీ ఫస్ట్ టైమ్ ఫుల్ మాసీ రోల్ లో వస్తున్నాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా వస్తున్న సినిమా దసరా. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇక ఈసినిమా మార్చి 30 వ తేదీన రిలీజ్ కాబోతుంది. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్…

నైజాం లో టిల్లు స్క్వేర్ మూవీ రైట్స్ కు భారీ డిమాండ్
సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్స్ పై విమల్ కృష్ణ దర్శకత్వంలో యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా తెరకెక్కిన డీజే టిల్లు. ఈసినిమా 2022 ఫిబ్రవరి 12 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. హీరో సిద్దు జొన్నలగడ్డ తన కామెడీ టైమింగ్, బాడీ లాంగ్వేజ్ తో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ చిన్న సినిమా భారీ విజయాన్ని సాధించడం విశేషం. ఈ మూవీ సీక్వెల్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

మారిన బద్రి మూవీ రీ రిలీజ్ డేట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన జల్సా, తమ్ముడు, ఖుషీ చిత్రాలు రీ రిలీజ్ అయ్యి మంచి వసూళ్లను రాబట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మరో సూపర్ హిట్ మూవీ బద్రి రీ రిలీజ్ తో ప్రేక్షకులను అలరించనున్నారు. విజయ లక్ష్మి మూవీస్ బ్యానర్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ బద్రి మూవీ ఘనవిజయం సాధించింది. హీరో పవన్ కళ్యాణ్ తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్, డైలాగ్ డెలివరీ తో ప్రేక్షకులను అలరించారు.

హెల్త్ పై విజయ్ ఆంటోని క్లారిటీ
విజయ్ ఆంటోని హీరోగా వచ్చిన బిచ్చగాడు సినిమా ఎంత హిట్ అయిందో చూశాం. ఇక ఇప్పుడు ఈసినిమాకు సీక్వెల్ గా వస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమాతో యాంటీ బిగిల్ గా ఈసారి సందడి చెయడానికి వచ్చేస్తున్నాడు విజయ్ ఆంటోని. ఈసినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. దాదాపు చివరి దశకు చేరుకుంది. ఇదిలా ఉండగా గత కొద్దిరోజులుగా ఈసినిమా మలేసియాలో షూటింగ్ ను జరుపుకుంటుంది. అయితే అక్కడ షూటింగ్ లో విజయ్ ఆంటోని గాయపడిన సంగతి కూడా విదితమే. ఇక ఇప్పుడు తన హెల్త్ పై క్లారిటీ ఇచ్చారు మేకర్స్. మలేషియా లో జరిగిన బిచ్చగాడు 2 షూటింగ్ లో జరిగిన ప్రమాదంలో దవడ ఎముక మరియు ముక్కు కి జరుపుకున్న పెద్ద సర్జరీ పూర్తి చేసుకున్నానని.. ప్రస్తుతం…

ఫార్ములా ఈ రేస్ కై ఆసక్తితో ఎదురుచూస్తున్న మహేష్ బాబు
వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాణిస్తున్న మహేష్ బాబు రీసెంట్ గా బ్లాక్ బస్టర్ సర్కారు వారి పాట మూవీతో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. శ్రీమతి మమత సమర్పణలో హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు, పూజా హెగ్డే జంటగా #SSMB 28 మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీ తరువాత స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న#SSMB 29 మూవీకి మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్ కు పవన్ కళ్యాణ్ అభినందనలు
స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం అఖండ విజయం సాధించి, భారీ వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే. పలు ఇంటర్ నేషనల్ అవార్డ్స్ అందుకున్న ఆర్ఆర్ఆర్ మూవీ రీసెంట్ గా ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకుంది. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు లభించింది. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు, హాలీవుడ్ డైరెక్టర్స్, పొలిటికల్ లీడర్స్ ఆర్ఆర్ఆర్ టీమ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

మూడు డిఫరెంట్ పాత్రల్లో సుధీర్ బాబు
టాలీవుడ్ లో ఉన్న హీరోల్లో ప్రతి ఒక్కరికీ ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అయితే ప్రయోగాలు చేయడానికి కొంతమంది మాత్రమే ముందుకు వస్తుంటారు. అలా ప్రయోగాలు చేసే వారిలో సుధీర్ బాబు కూడా ముందుంటాడు. సినిమా జయాపజయాలను పక్కనపెట్టి తన ప్రతి సినిమాకి కూడా ఏదో ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ తో ఆశ్చర్యపరుస్తూనే ఉంటాడు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు సుధీర్ బాబు. ప్రస్తుతం తను నుండి రిలీజ్ కు సిద్దంగా ఉన్న సినిమా హంట్. మహేష్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రాబోతున్న ఈసినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. శ్రీకాంత్, భరత్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈసినిమా జనవరి 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

బ్రేక్ ఈవెన్ సాధించి, ప్రాఫిట్స్ తో వీరసింహారెడ్డి
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా వాస్తవ సంఘటనలతో రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ వీరసింహారెడ్డి మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి, విజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటించారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. వీరసింహారెడ్డి మూవీలో వీర సింహారెడ్డిగా, జయసింహా రెడ్డిగా రెండు పాత్రల్లో అద్భుతంగా నటించిన హీరో బాలకృష్ణ ప్రేక్షక, అభిమానులను ఆకట్టుకున్నారు. కొన్ని ఎమోషనల్…