పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా రీఎంట్రీ తరువాత ఒక సినిమా తరువాత మరో సినిమాను చేసుకుంటూ వెళుతున్నారు. ఒక పక్క రాజకీయాలతో బిజీగా ఉన్నా కూడా షూటింగ్ లలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం అయితే తను చేస్తున్న సినిమా హరిహర వీరమల్లు. క్రిష్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇక ఈసినిమా తో పాటు పవన్ హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే కదా. వీరిద్దరి కాంబినేషన్ కోసం కూడా అభిమానులు ఎప్పటినుండో వెయిట్ చేస్తున్నారు. త్వరలోనే ఈసినిమా షూటింగ్ ను కూడా మొదలుపెట్టనున్నట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమాలతో పాటు పవన్ సాహో డైరెక్టర్ సుజీత్ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇటీవలే ఈసినిమాను అధికారికంగా ప్రకటించారు. అయితే తాజాగా ఈసినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి తెరపైకి వచ్చింది. అదేంటంటే ఈ సినిమా ప్రారంభించడానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. జనవరి 30వ తేదీన ఈ సినిమాని గ్రాండ్‌గా ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట. మరి దీనిపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే. కాగా ఈసినిమాను డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు రవి..కె.చంద్రన్ డీవోపీ అందిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియచేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: