అలనాటి నటి జమున కన్నుమూత

Senior Actress Jamuna Passed Away,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Teollywood News,Jamuna,Jamuna Latest News,Jamuna News,Actress Jamuna,Heroine Jamuna,Senior Actress Jamuna No More,Veteran Telugu actress Jamuna passes away at 86,Veteran Tollywood actress Jamuna passes away,Veteran Telugu actor Jamuna passes away at 86,Veteran actress Jamuna passes away at 86,Tollywood legendary actress Jamuna passes away,Senior Actress Jamuna Passes Away Updates,Actress Jamuna Is No More

ఈమధ్య కాలంలో ఎంతో మంది తెలుగు సినీ నటులను కోల్పోయింది సినీ పరిశ్రమ. ఇక గత ఏడాది అయితే సినీ లెజెండరీస్ సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు, నవరస నటనాసార్వభౌముడు సత్య నారాయణ లాంటి దిగ్గజాలు సైతం సినీ లోకాన్ని విడిచి వెళ్లారు. ఇప్పుడు మరో సీనియర్ నటి, అలనాటి నటి జమున కూడా నేడు తుదిశ్వాస విడవడం మరోసారి సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. వయోభారంవల్ల వచ్చే అనారోగ్య సమస్యలతో జమున గత కొంత కాలంగా బాధపడుతున్నారు. ఈనేపథఅయంలో నేడు హైదరాబాద్‌లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఫిలిం ఛాంబర్‌కు జమున పార్థీవ దేహాన్ని తీసుకురానున్నారు. ఆమె మరణవార్త తెలిసి టాలీవుడ్ లో విషాదం అలుముకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా 1936 ఆగష్ట్ 30న హంపిలో జమున జన్మించారు. పుట్టింది కర్నాటకలో అయినా తన పెరిగింది మాత్రం ఏపీలోని గుంటూరు జిల్లాలోని దుగ్గిరాలలోనే. చిన్నతనం నుండి నాటకాలు అంటే ఇష్టం ఉండటంతో పలు స్టేజ్ పెర్ఫామెన్స్ లు కూడా ఇచ్చింది. ఆతరువాత సినీ రంగంలోకి ప్రవేశించింది. పుట్టినిల్లు సినిమా ద్వారా తెరంగేట్రం చేసిన జమున తన అందం, అభినయంతో తక్కువ కాలంలోనే మంచి గుర్తింపును తెచ్చుకుంది.

కెరీర్ ఆరంభంలోనే ఎన్టీఆర్ , ఏఎన్నార్ లాంటి అగ్ర హీరోలతో నటించి మంచి గుర్తింపు పొందారు జమున. ఎంతో మంది లెజెండరీ యాక్టర్స్ తో.. డైరెక్టర్స్ తో పనిచేశారు. `దొంగరాముడు`, `మిస్సమ్మ`, `చిరంజీవులు`, `ముద్దుబిడ్డ`, `భాగ్యరేఖ`, `భూకైలాస్`, `ఇల్లరికం`, `గుండమ్మ కథ`, `బొబ్బిలి యుద్ధం`, `మూగ మనసులు`, `రాముడు భీముడు`, `మంగమ్మ శపథం`, `తోడూనీడా`, `పూలరంగడు`, `రాము`, `మట్టిలో మాణిక్యం`, `పండంటి కాపురం`, `దొరికితే దొంగలు`, `తాసిల్దార్ గారి అమ్మాయి` ఇలాంటి చిత్రాల్లో జమున నట విశ్వరూపం చూశారు తెలుగు ప్రేక్షకులు. 1960 మరియు 1970 గోల్డెన్ ఎరాలో స్టార్ హీరోయిన్ గా ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించిన జమునకు 1990 లో హిందీ సినిమా లేడీ టార్జన్ సినిమా ఆఖరి సినిమా. ఆ తరువాత ఆమె సినీ పరిశ్రమకు దూరమయ్యారు. దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో, వివిధ పాత్రల్లో ప్రేక్షకుల హృదయాలలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు.

అనంతరం రాజకీయాల్లో కూడా ఆమె తన చేయి వేశారు. 1989 లో కాంగ్రెస్ పార్టీ తరఫున నుంచి లోక్ సభ నియోజకవర్గంకు ఎంపీగా ఎన్నికయ్యారు. 1991 లో అక్కడ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆపై బిజెపిలో చేరారు. చాలా రోజులుగా రాజకీయాలకు, నటనకు దూరంగా ఉంటూ వస్తున్నారు.

ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే సినిమాలు చేస్తుండగానే ప్రొఫెసర్ జూలూరి రమణారావును వివాహం చేసుకున్నారు జమున. వారికి వంశీ, స్రవంతి అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వంశీ మీడియా ప్రొఫెసర్ గా విదేశాల్లో పని చేస్తున్నారు. స్రవంతి కి పెళ్లయింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + eighteen =