ఇండియన్ 2 కోసం ఆర్ఆర్ఆర్ ఆస్కార్ కొరియోగ్రాఫర్

RRR Oscar Choreographer for Indian 2 Movie,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Teollywood News,Indian 2,Indian 2 Movie,Indian 2 Telugu Movie,Indian 2 Movie Updates,Indian 2 Telugu Movie Latest News,Indian 2 Movie Shooting Updates,Indian 2 Telugu Movie Shooting Latest News,Kamal Haasan,Shankar

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంత గుర్తింపు తెచ్చుకుందో తెలిసిందే కదా. ఎన్నో అంతర్జాతీయ అవార్డులను సైతం అందుకుంటుంది. రీసెంట్ గా నాటు నాటు సాంగ్ ఆస్కార్ నామినేషన్లలో సైతం చోటు దక్కించుకుంది. ఇక ఆర్ఆర్ఆర్ కు వచ్చిన గుర్తింపుతో ఆసినిమా టెక్నీషియన్స్ కు కూడా బిజీ అవుతున్నారు. ఈనేపథ్యంలోనే ఆర్ఆర్ఆర్ సినిమా కొరియోగ్రాఫర్ కు ఇండియన్ సినిమాలో ఛాన్స్ దక్కించుకున్నాడు. లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా వస్తున్న సినిమా ఇండియన్ 2. ఈసినిమా భారతీయుడు సినిమాకు ఈసినిమా సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా షూటింగ్ కు వచ్చిన అడ్డంకులు అన్నీ ఇన్నీ కాదు. అవన్నీ తట్టుకొని ఇప్పుడు శరవేగంగా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఇప్పుడు ఈసినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఈ సినిమాలో ఓ సాంగ్ కోసం శంకర్ ఆర్ఆర్ఆర్ నుంచి ప్రముఖ కొరియోగ్రాఫర్ ని తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆ కొరియోగ్రాఫర్ ఎవరో కాదు.. ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాటకు కొరియోగ్రఫి చేసిన ప్రేమ్ రక్షిత్. ఇండియన్2 లో ఓ కీలక సాంగ్ కోసం గాను ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ని శంకర్ తీసుకున్నట్టుగా సమాచారం. మరి వీరి కలయికలో ఆ సాంగ్ ఎంత గ్రాండ్ గా ఉంటుందో చూడాలి.

కాగా ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియ భవాని శంకర్ ఫీమేల్ లీడ్ లో నటిస్తుండగా.. సిద్ధార్ధ్, సముద్రఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six − 4 =