వీర సింహారెడ్డి మూవీ పై తలైవా రజనీకాంత్ ప్రశంసలు

Superstar Rajinikanth praises Veera Simha Reddy Movie and Team,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Teollywood News,Superstar Rajinikanth,Superstar Rajinikanth Latest News,Superstar Rajinikanth Upcoming Movie News,Superstar Rajinikanth About Veera Simha Reddy Movie and Team,Superstar Rajinikanth Comments On Veera Simha Reddy Movie and Team,Superstar Rajinikanth Sensational Comments On Veera Simha Reddy Movie and Team,Superstar Rajinikanth Shocking Comments On Veera Simha Reddy Movie and Team,Superstar Rajinikanth Comments On Veera Simha Reddy Telugu Movie and Team,Veera Simha Reddy,Veera Simha Reddy Movie,Veera Simha Reddy Telugu Movie,Veera Simha Reddy Movie Updates,Veera Simha Reddy Telugu Movie Latest News,Balakrishna,Shruti Haasan,Gopichand Malineni

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా వాస్తవ సంఘటనలతో రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ వీరసింహారెడ్డి మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి, విజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటించారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. వీరసింహారెడ్డి మూవీలో వీర సింహారెడ్డిగా, జయసింహా రెడ్డిగా రెండు పాత్రల్లో అద్భుతంగా నటించిన హీరో బాలకృష్ణ ప్రేక్షక, అభిమానులను ఆకట్టుకున్నారు. కొన్ని ఎమోషనల్ అండ్ యాక్షన్ సన్నివేశాల్లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని బాలకృష్ణ ఈ మూవీకి హైలైట్ గా నిలిచారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బ్రేక్ ఈవెన్ సాధించిన వీర సింహారెడ్డి మూవీ ప్రాఫిట్స్ తో దూసుకుపోతోంది. తాజాగా ఈ చిత్రాన్ని చూసిన సూపర్ స్టార్ రజినీకాంత్ అభినందించిన విషయాన్ని డైరెక్టర్ గోపీచంద్ మలినేని వెల్లడించి.. ఇది తనకు సర్రియల్ మూమెంట్ అన్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ సార్ నుండి కాల్ ను రిసీవ్ చేసుకున్నాననీ.. రజనీకాంత్ వీరసింహారెడ్డి సినిమాను చూశారనీ.. ఆయనకు బాగా నచ్చిందనీ.. తన సినిమా గురించి ఆయన ప్రశంసలు మరియు ఆయన అనుభవించిన భావోద్వేగం తనకు ఈ ప్రపంచంలో అన్నింటికంటే ఎక్కువ అనీ.. థ్యాంక్యూ రజనీ సార్ అని గోపీచంద్ చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here