షూటింగ్ చివరి దశలో మార్క్ అంథోని

Mark Antony Shooting Nearing Completion,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Teollywood News,Mark Antony,Mark Antony Movie,Mark Antony Telugu Movie,Mark Antony Movie Updates,Mark Antony Telugu Movie Latest News,Mark Antony Shooting Updates,Mark Antony Telugu Movie Shooting Latest News

తన సినిమాలతో తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా ఎంతోమంది ప్రేక్షకులను సొంతం చేసుకున్నాడు విశాల్. ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ గ్యాప్ లేకుండా బిజీ బిజీగా కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం అయితే పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు విశాల్. ఇటీవలే ఏ వినోద్ కుమార్ దర్శకత్వంలో లాఠీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆసినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు మరో సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో మార్క్ అంథోని అనే యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ సినిమా చేస్తున్నాడు విశాల్. ఈసినిమా షూటింగ్ ఎప్పటినుండో జరుగుతుంది. ఇక తాజా సమచారం ప్రకారం ఈసినిమా చివరి దశకు చేరుకున్నట్టు తెలుస్తుంది. ఫైనల్ షెడ్యూల్ లో ఉన్న ఈసినిమా పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించుకున్నట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా విశాల్ కు జోడీగా రీతూవర్మ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఎస్ జె సూర్య ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈసినిమాలో సునీల్ కూడా ఒక కీలక పాత్రలో నటించే అవకాశం దక్కించుకున్నాడు. మినీ స్టూడియో బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తుండగా.. జి.వి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని త‌మిళంతో పాటు, తెలుగు, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో మేక‌ర్స్ రిలీజ్ చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 5 =