బుట్టబొమ్మ ట్రైలర్ రిలీజ్

Butta Bomma Trailer Out Now,Butta Bomma Trailer Has Been Released By Vishwak Sen,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Teollywood News,Butta Bomma,Butta Bomma Movie,Butta Bomma Telugu Movie,Butta Bomma Movie Updates,Butta Bomma Telugu Movie Latest News,Butta Bomma Trailer,Butta Bomma Movie Trailer,Butta Bomma Telugu Movie Trailer,Butta Bomma Official Trailer,Butta Bomma Movie Latest Trailer

విశ్వాసం ఫేమ్ అనికా సురేంద్రన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. బాలనటిగా ఎన్నో సినిమాల్లో నటించిన అనికా ఇప్పుడు హీరోయిన్ గా ప్రధాన పాత్రలో ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకత్వంలో అనికా హీరోయిన్ గా వస్తున్న సినిమా బుట్టబొమ్మ. ఈసినిమా ఫిబ్రవరి 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. దీనిలో భాగంగానే ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, పాటలు సినిమాపై అంచనాలను పెంచేశాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా ట్రైలర్ ను నేడు రిలీజ్ చేశారు మేకర్స్. యంగ్ హీరో విశ్వక్ సేన్ ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ ను చూస్తుంటే ఇది విలేజ్ లవ్ స్టోరీ అని అర్థమవుతుంది. ఆటోడ్రైవర్‌ పాత్రలో సూర్యవశిష్ఠ నటిస్తుండగా.. కాలేజీ యువతి పాత్రలో అనిఖా సురేంద్రన్‌ కనిపించనుంది. ఈ ఇద్దరి మధ్య లవ్ ట్రాక్‌లో అర్జున్ దాస్‌ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఏం జరిగిందనేది సస్పెన్స్ లో పెడుతూ కట్ చేసిన ట్రైలర్ ఆసక్తిని పెంచుతోంది.

ఇంకా ఈసినిమాలో అర్జున్ దాస్, సూర్య వశిష్ట ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. గోపీసుందర్ సంగీతం అందించారు. ఈ మూవీ ఫిబ్రవరి 4న రిలీజ్ కి రెడీ అవుతోంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 8 =