2024 సంక్రాంతి రేసులో పవన్?

Pawan Kalyan to Join Sankranthi 2024 Race,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Teollywood News,Pawan Kalyan,Pawan Kalyan Latest News,Pawan Kalyan Upcoming Movie News,Pawan Kalyan Latest Film Details,Pawan Kalyan Next Project News,Pawan Kalyan New Movie In Sankranthi 2024 Race

ఈ ఏడాది సంక్రాంతి అయిపోయింది. సంక్రాంతికి బరిలో దిగిన రెండు తెలుగు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ తో దూసుకుపోతున్నాయి. ఇక అప్పుడే వచ్చే ఏడాది సంక్రాంతికి పోటీ వచ్చేస్తుంది. ఇప్పటికే రామ్ చరణ్ ఆర్సీ 15 సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి బరిలో దిగనున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఆలిస్ట్ లో చేరిపోయినట్టు కనిపిస్తుంది. వకీల్ సాబ్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి సాలిడ్ రీఎంట్రీ కొట్టిన పవన్. ఆ తరువాత భీమ్లానాయక్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ప్రస్తుతం పవన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుంది హ్యాట్రిక్ హిట్ కోసం. ఈ హిట్ కోసం ఎన్నో రోజుల నుండి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ ప్రస్తుతం చేస్తున్న సినిమా హరిహర వీరమల్లు సినిమా. ఈసినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైనా కూడా ఇప్పటివరకూ పూర్తి చేసుకోలేకపోయింది. పవన్ సినిమాలతో పాటు మరోవైపు రాజకీయాలతో కూడా బిజీగా ఉండటంతో ఈసినిమా పూర్తవ్వడంలేదు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా తరువాత హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ అలానే సాహో డైరెక్టర్ సుజీతో మరో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే కదా. వీటిలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభించనున్నట్టు తెలుస్తుంది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈసినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను 2024 సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలిపాడు. అన్నీ అనుకున్న ప్లాన్ ప్రకారం జరిగితే 2024 సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేస్తామని తెలిపారు. మరి చూద్దాం హరీష్ ప్లాన్ ఎంత వరకూ వర్కవుట్ అవుతుందో..

కాగా ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై భారీ బడ్జెట్ తోనే నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో పవన్‌ సరసన పూజా హెగ్డే నటించనుంది. ఈసినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు. మరి గబ్బర్ సింగ్ తరువాత రానున్న సినిమా కావడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా ఈమూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. చూద్దాం ఈసారి పవన్ తో హరీష్ శంకర్ ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తాడో.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − eight =