నందమూరి తారకరత్న నిన్న గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే కదా. లోకేష్ మొదలుపెట్టిన ‘యువగళం’ పాదయాత్ర కార్యక్రమంలో తారకరత్న పాల్గొన్నారు. నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్ మరియు టీడీపీ కార్యకర్తలతో కలిసి పాదయాత్రలో ముందుకు నడిచాడు. అయితే కొంత సమయానికి నడుస్తూ నడుస్తూ తారకరత్న ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయాడు. అతనిని వెంటనే అక్కడి నుంచి కుప్పంలోని హాస్పిటల్ కి తరలించారు కార్యకర్తలు. అయితే అప్పటికే పల్స్ పడిపోవడంతో డాక్టర్లు సీపీఆర్ చేసి పల్స్ వచ్చేటట్లు చేశారు. అయితే అనంతరం పరిస్థితి విషమంగానే ఉండటంతో తారకరత్నను బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో తరలించారు. ప్రస్తుతం అక్కడే చికిత్స పొందుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఫ్యాన్స్ తో పాటు ఎంతోమంది తారకరత్న హెల్త్ బులెటిన్ కోసం వెయిట్ చేస్తున్నారు. తాజాగా తారకరత్న హెల్త్ బులెటిన్ ఇచ్చారు నారాయణ హృదయాలయ ఆస్పత్రి యాజమాన్యం. ఇక వైద్య బృందం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ఏముందంటే.. జనవరి 27న తారక రత్నను కార్డియాక్ అరెస్టుతో కుప్పం లోని ఒక ఆసుపత్రిలో చేర్చారు. 45 నిమిషాల పాటూ ప్రాథమిక చికిత్స, పేషెంట్ ని రివైవ్ చేసే ప్రక్రియ చేశారు (రిసస్టియేషన్). అయినప్పటికీ తారక రత్న పరిస్థితి విషమంగా బెంగళూరు నుంచి కుప్పం వెళ్లిన నారాయణ హృదయాలయ వైద్యులు, మంచి చికిత్స కోసం, తారకరత్నను బెంగళూరు తరలించాలని సూచించారు. ప్రస్తుతం అయితే ఆయన పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని.. పూర్తిగా వైద్యసాయంపైనే ఆయన ఆధారపడి ఉన్నారని.. చికిత్స కొనసాగుతాయని వివరించారు. ఈ సమయంలో తారకరత్నను సందర్శించేందుకు ఎవరూ రావొద్దని, చికిత్సకు ఆటంకం కలిగించవద్దని నారాయణ హృదయాలయ బులెటిన్ లో విజ్ఞప్తి చేసింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: