
ట్యాగ్ · 17286 కథనాలు · పేజీ 252


చంద్రమోహన్ మృతిపై ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్

టాలీవుడ్‌లో విషాదం.. నటుడు చంద్రమోహన్ కన్నుమూత

భగవంత్ కేసరి హిందీ రిలీజ్ పై బాలయ్య క్లారిటీ

టీఆర్పీ రేటింగ్స్ లో అదరగొట్టిన ఆదిపురుష్

నాన్నగారి చరిత్రకు ఇది ఘనమైన నివాళి

సలార్ తమిళ్ లో రిలీజ్ చేసేది ఎవరంటే?

లూసిఫర్ సీక్వెల్- మోహన్ లాల్ ఫస్ట్ లుక్ రిలీజ్
మలయాళం మెగాస్టార్ మోహన్ లాల్ ఇప్పుడు కూడా వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇప్పటికే పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు మోహన్ లాల్. అందులో పృథ్విరాజ్ సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి. ఎంపురాన్ అనే టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా లూసిఫర్ సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా.లూసిఫర్‘ చిత్రంతో దర్శకుడిగా మారాడు మరో మలయాళీ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్. లూసిఫర్ కి సీక్వెల్ గా ఎల్2ఇ: ఎంపురాన్ అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది.

కోట బొమ్మాళి టైటిల్ సాంగ్ రిలీజ్
ఈమధ్య కాలంలో మలయాళంలో రిలీజ్ అయిన సినిమాలు తెలుగులోకి ఎక్కువ రీమేక్ అవుతున్న సంగతి తెలిసిదే కదా. ఈనేపథ్యంలోనే ఇప్పుడు మరో సినిమా రీమేక్ అయి రిలీజ్ కు సిద్దమవుతుంది. నాయట్టు సినిమా మలయాళంలో ఎంత సూపర్ హిట్ అయిందో చూశాం. ఇక ఈసినిమా ఇప్పుడు తెలుగులో కూడా రీమేక్ అయింది. కోట బొమ్మాళి పీఎస్ అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది.తేజ మార్ని దర్శకత్వంలో శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో ఈసినిమా వస్తుంది.

సింహాద్రి వల్ల డైరెక్టర్ అవ్వాలని అనుకున్నా -హాయ్ నాన్న డైరెక్టర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన బ్లాక్ బాస్టర్ మూవీ సింహాద్రి తనను సినిమాలవైపు మళ్లేలా చేసిందని హాయ్ నాన్న డైరెక్టర్ శౌర్యువ్ తెలిపాడు.న్యాచురల్ స్టార్ నాని నటించిన ఈసినిమాతో శౌర్యువ్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్నాడు.పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈసినిమా డిసెంబర్ 8న విడుదలకానుంది.ప్రస్తుతం టీం ప్రమోషన్స్ తో బిజీ గా వుంది.అందులో భాగంగా ఇంటర్వ్యూ లో పాల్గొంటున్నారు.తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో శౌర్యవ్ ను డైరెక్టర్ గా మారడానికి ఎక్కువ ప్రభావం చూపిన సినిమా ఏదని అడుగగా దానికి అతను సింహాద్రి అంటూ చెప్పుకొచ్చాడు.అలాగే హాయ్ నాన్న మంచి విజయం సాధిస్తుందని చాలా కాన్ఫిడెంట్ గా వున్నాడు ఈ…

మంగళవారంలో ఆ సాంగ్ ఉండదట
ట్రైలర్ తో మంచి బజ్ ను క్రీయేట్ చేయగలిగింది మంగళవారం అనే సినిమా.ప్రీరిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగింది.ఆర్ ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి నుండి వస్తున్న సినిమా ఇది.థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కించాడు.పాయల్ రాజ్ పుత్ మెయిన్ లీడ్ గా నటించింది.ఆర్ ఎక్స్ 100లో బోల్డ్ గా కనిపించిన పాయల్ ఈసినిమాలో మరింతగా రెచ్చిపోయిందట.ఇక ఈసినిమానుండి ఇటీవల ఓసాంగ్ ను రిలీజ్ చేశారు.యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఈసాంగ్ లో కనిపించాడు.అదే అప్పడప్పడ తాండ్ర సాంగ్.యూ ట్యూబ్ లో మంచి వ్యూస్ ను రాబట్టుకుంది.అయితే ఈ సాంగ్ థియేట్రికల్ వెర్షన్ లో ఉండదట.ఈవిషయాన్ని అజయ్ భూపతి వెల్లడించాడు.

చంద్రమోహన్ మృతి.. బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ సహా పలువురు సినీ ప్రముఖుల సంతాపం
టాలీవుడ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు చంద్రమోహన్ మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శనివారం తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు చంద్రమోహన్ ఈ ఉదయం 9.45 గంటలకు ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. కాగా ఆయనకు భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇక చంద్రమోహన్ అంత్యక్రియలను సోమవారం హైదరాబాద్ మహాప్రస్థానంలో నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలియజేశారు.

గేమ్ ఛేంజర్- ఫ్యాన్స్ కు నిరాశ.. జరగండి సాంగ్ పోస్ట్ పోన్
రామ్ చరణ్ ఫ్యాన్స్ కు మరోసారి నిరాశ ఎదురైంది. రామ్ చరణ్ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ దీపావళి కి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. జరగండి అంటూ ఈపాట వస్తుంది. ఇక పోస్టర్లు కూడా కలర్ ఫుల్ గా ఉండటంతో ఈపాట కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు మేకర్స్ ఇచ్చిన ట్విస్ట్ కు మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఈపాట రిలీజ్ పోస్ట్ పోన్ చేస్తున్నట్టు ఇప్పటికే వార్తలు మొదలయ్యాయి. ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ పాట రిలీజ్ ను పోస్ట్ పోన్ చేస్తున్నట్టు ప్రకటించారు. కొన్ని ఆడియో డాక్యుమెంటేషనన్ ఇష్యూస్ వల్ల ఈపాట రిలీజ్ ను వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. త్వరలోనే అప్…

చిన్నా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
హీరో సిద్దార్థ్ తన సినిమాలతో తెలుగులో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఆతరువాత కొత్త కొత్త హీరోలు రావడం.. మరోవైపు సిద్దార్థ్ కూడా వరుస పరాజయాలు అందుకోవడంతో సినిమా అవకాశాలు కాస్త తగ్గాయి. మళ్లీ ఇప్పుడు కెరీర్ లో నిలదొక్కుకుంటున్నాడు. ఇక ఇప్పుడు నిర్మాతగా కూడా మారాడు.

దీపావళి సెలబ్రేషన్స్‌లో.. షారుఖ్ సాంగ్‌కు అమెరికా రాయబారి డ్యాన్స్, వీడియో వైరల్
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన నటనతో దేశవ్యాప్తంగానే కాక విదేశాల్లో సైతం కోట్లాది మందిని తన అభిమానులుగా మార్చుకున్నారు ఆయన. ఇక షారుఖ్ అభిమానుల్లో సాధారణ ప్రేక్షకులే కాదు, పలువురు ప్రముఖులు కూడా ఉంటారంటే అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఇండియాలో దీపావళి పండుగ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఇక్కడివారితో సహా విదేశాల్లో ఉన్న భారతీయులందరూ ఘనంగా ఈ వేడుకలను జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలోని అమెరికా దౌత్య కార్యాలయంలో దీపావళి వేడుకలు నిర్వహించారు.

చంద్రమోహన్ మృతిపై.. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ ఎమోషనల్ ట్వీట్స్
టాలీవుడ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు చంద్రమోహన్ మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శనివారం తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు చంద్రమోహన్ ఈ ఉదయం 9.45 గంటలకు ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. కాగా ఆయనకు భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇక చంద్రమోహన్ అంత్యక్రియలను సోమవారం హైదరాబాద్ మహాప్రస్థానంలో నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలియజేశారు.

చంద్రమోహన్ మృతిపై ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్
తెలుగు సినీ పరిశ్రమ ఈమధ్య కాలంలో ఎంతోమంది లెజెండరీ నటీనటులను కోల్పోయింది. గత ఏడాది అయితే సూపర్ స్టార్ కృష్ణ ను పొగొట్టుకుంది చిత్రపరిశ్రమ. కృష్ణ గారితో పాటు సత్యనారాయణ, చలపతిరావు లాంటి సీనియర్ నటులు సైతం మరణించారు. ఇక ఇప్పుడు మరో లెజెండరీ యాక్టర్ ను కోల్పోయింది టాలీవుడ్. సీనియర్ నటుడు చంద్రమోహన్ నేడు తుదిశ్వాస విడిచారు. గత కొద్దికాలంగా చంద్రమోహన్ వయసురీత్యా వచ్చే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే కదా. ఇక నేడు ఆరోగ్యం మరింత క్షీణించడంతో హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందతూ మరణించారు.

టాలీవుడ్‌లో విషాదం.. నటుడు చంద్రమోహన్ కన్నుమూత
టాలీవుడ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు చంద్రమోహన్ మృతి చెందారు. 80 సంవత్సరాల ఆయన గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా చంద్రమోహన్ గుండె సంబంధిత సమస్యతో హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ఈ నేపథ్యంలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శనివారం తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు చంద్రమోహన్ ఈ ఉదయం 9.45 గంటలకు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.

సప్త సాగరాలు దాటి సైడ్ బి టైటిల్ సాంగ్ రిలీజ్
హేమంత్ ఎం రావు దర్శకత్వంలో రక్షిత్ శెట్టి హీరోగా వచ్చిన సినిమా సప్త సాగరాలు దాటి. ఈ సినిమా ఇక్కడ కూడా సూపర్ హిట్ అయింది. ఈసినిమా రెండు భాగాలుగా వస్తున్న సంగతి తెలిసిందే కదా. నవంబర్ 17వ తేదీన సెకండ్ పార్ట్ ను రిలీజ్ చేయనున్నారు. సప్త సాగరాలు దాటి-సైడ్ బి అంటూ తెలుగులో రిలీజ్ అవుతుంది.

హరోం హర నుండి సునీల్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
ఈ ఏడాది ఇప్పటికే హంట్ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు సుధీర్ బాబు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో హరోం హర సినిమా కూడా ఒకటి. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం అయితే శరవేగంగా జరుపుకుంటుంది. ఆమధ్య ఈసినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేయగా అది బాగానే ఆకట్టుకుంది.

భగవంత్ కేసరి హిందీ రిలీజ్ పై బాలయ్య క్లారిటీ
హిట్ అయిన సినిమాలను వేరే భాషలో రిలీజ్ చేయడం ఇప్పుడు కామన్ అయిపోయింది. ఈనేపథ్యంలోనే ఇప్పటికే మన తెలుగు సినిమాలు హిందీలో రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు మరో బ్లాక్ బస్టర్ సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఆ బ్లాక్ బస్టర్ సినిమా మరేదో కాదు రీసెంట్ గా వచ్చి ప్రేక్షకాదరణ పొందిన భగవంత్ కేసరి సినిమా. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా మాస్ ప్లస్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా వచ్చింది. ఈసినిమా అందరికీ నచ్చడంతో సూపర్ హిట్ అయింది.

టీఆర్పీ రేటింగ్స్ లో అదరగొట్టిన ఆదిపురుష్
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మైథలాజికల్ మూవీ ఆదిపురుష్ ఈ జూన్ లో విడుదలై 500కోట్లకు పైగా వసూళ్లను రాబట్టుకుంది.రామాయణం ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఈసినిమాలో ప్రభాస్ రాముడిగా నటించగా సీతగా కృతి సనన్ రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ కనిపించారు. ఇక ఈసినిమా టీవీ లో కూడా సూపర్ హిట్ అనిపించుకుంది. ఈసినిమా ను స్టార్ మా మొదటి సారి అక్టోబర్ 29న వరల్డ్ ప్రీమియర్ మూవీ గా టెలికాస్ట్ చేయగా 10.6 రేటింగ్స్ ను రాబట్టుకుంది.అజయ్ అతుల్ ఈసినిమాకు సంగీతం అందించగా భూషణ్ కుమార్ ,ప్రసాద్ సుతార్, కృష్ణన్ కుమార్ ,వంశీ ,ప్రమోద్ కలిసి నిర్మించారు.

నాన్నగారి చరిత్రకు ఇది ఘనమైన నివాళి
అలనాటి దివంగత సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన సినిమాలతో నటనతో తెలుగు సినీ పరిశ్రమకు ఎంతో గుర్తింపుతెచ్చారు. సుమారు ఐదు దశాబ్దాల పాటు హీరో, నిర్మాత, దర్శకుడిగా అన్నీ పాత్రలు పోషించిన కృష్ణ 300పైగా చిత్రాల్లో నటించారు. ఇక గత ఏడాది నవంబర్ 15వ తేదీన ఆయన మరణించిన సంగతి తెలిసిందే కదా. అయితే తాజాగా సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని విజయవాడలో ఆవిష్కరించారు. విజయవాడలోని గురునానక్ కాలనీలో ఏర్పాటు చేసిన విగ్రహాన్న దేవినేని అవినాష్ తో కలిసి లోకనాయకుడు కమలహాసన్ ఆవిష్కరించారు.

ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్- యూత్ ఫుల్ బ్రష్ వేసుకో సాంగ్ రిలీజ్
సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అయితే మంచి హిట్ కోసం మాత్రం ఎప్పటినుండో వెయిట్ చేస్తున్నాడు. భీష్మ తరువాత ఇప్పటివరకూ సరైన సక్సెస్ ను అందుకోలేకపోయిన నితిన్ సరైన హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఈనేపథ్యంలోనే స్టార్ రైటర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే సినిమాతో వస్తున్నాడు. డిసెంబర్8వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టశారు మేకర్స్. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

గుంటూరు కారంలో మహేష్ బాబు క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే? - నమ్రతా శిరోద్కర్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వస్తోన్న లేటెస్ట్ మూవీ ‘గుంటూరు కారం’. 'అతడు', 'ఖలేజా' సినిమాల తర్వాత వీరి కాంబినేషన్‌లో వస్తోన్న మూడో సినిమా కావడం, అలాగే మహేష్ బాబు ఈ చిత్రంలో ఫుల్ మాస్ క్యారెక్టర్ చేస్తుండటంతో 'గుంటూరు కారం'పై అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లో సైతం అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మహేష్ బాబు సతీమణి, ప్రముఖ నటి నమ్రతా శిరోద్కర్ ఈ మూవీకి సంబంధించి కొన్ని కీలక విషయాలను వెల్లడించారు. ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన ఆమె అక్కడ ఒక మీడియా ప్రతినిధితో కొద్దిసేపు చిట్ చాట్ చేశారు.

సలార్ తమిళ్ లో రిలీజ్ చేసేది ఎవరంటే?
ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా సలార్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా వస్తుంటంతో సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది ఈసినిమా. ఇక ఈసినిమా రిలీజ్ పై పలు రూమర్లు తెరపైకి వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే మేకర్స్ ఈసినిమా చెప్పిన తేదీకే అంటే డిసెంబర్ 22వ తేదీనే ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు క్లారిటీ ఇచ్చారు.

బాలయ్య బాబు బాంబ్ లాంటి వాడు - దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ ‘భగవంత్ కేసరి' బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని బాక్సాఫీస్ కా షేర్‌గా నిలిచింది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా, శ్రీలీల కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం, ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి, అభిమానులు, ప్రేక్షకులు, విమర్శకులందరి ప్రశంసలు అందుకొని అఖండ విజయం సాధించింది. ‘భగవంత్ కేసరి' సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతూ బాక్సాఫీస్ వద్ద రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ సాధించి నందమూరి బాలకృష్ణ కెరీర్…