ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా సలార్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా వస్తుంటంతో సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది ఈసినిమా. ఇక ఈసినిమా రిలీజ్ పై పలు రూమర్లు తెరపైకి వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే మేకర్స్ ఈసినిమా చెప్పిన తేదీకే అంటే డిసెంబర్ 22వ తేదీనే ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు క్లారిటీ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమాను తమిళ్ తో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ లో కూడా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో ఈసినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులకు సంబంధించిన అప్ డేట్లు ఇస్తున్నారు. ఇప్పటికే కేరళలో ఈసినిమమాను పృథ్వీ రాజ్ ప్రొడక్షన్స్ రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు తాజాగా తమిళ్ రిలీజ్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు. తమిళ్ లో ఈసినిమా రిలీజ్ హక్కులను రెడ్ గెయింట్ మూవీస్ వారు సొంతం చేసుకొని తమిళ్ లో రిలీజ్ చేయనున్నారు.
Excited to join forces with @RedGiantMovies_ for an epic collaboration!
Brace yourselves for the cinematic spectacle #SalaarCeaseFire, தமிழ் ரசிகர்களுக்காக, தமிழ்நாட்டிற்கு வருகிறது.#Salaar #Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @hombalefilms @VKiragandur… pic.twitter.com/GSVFO6OT6R
— Hombale Films (@hombalefilms) November 10, 2023
కాగా ఈసినిమాలో శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, శ్రేయ రెడ్డి కీలక పాత్రలలో నటిస్తున్నారు. హోంబలే ఫిలిమ్స్ పతాకంపై బ్లాక్ బస్టర్ మూవీ ‘కె.జి.యఫ్’ నిర్మించిన విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా భువన్ గౌడ సినిమాటోగ్రఫర్ గా పనిచేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
[td_block_video_youtube playlist_title=”” playlist_yt=”_vX4Lqi5bcs,XOF
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: