ఈమధ్య కాలంలో మలయాళంలో రిలీజ్ అయిన సినిమాలు తెలుగులోకి ఎక్కువ రీమేక్ అవుతున్న సంగతి తెలిసిదే కదా. ఈనేపథ్యంలోనే ఇప్పుడు మరో సినిమా రీమేక్ అయి రిలీజ్ కు సిద్దమవుతుంది. నాయట్టు సినిమా మలయాళంలో ఎంత సూపర్ హిట్ అయిందో చూశాం. ఇక ఈసినిమా ఇప్పుడు తెలుగులో కూడా రీమేక్ అయింది. కోట బొమ్మాళి పీఎస్ అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది.తేజ మార్ని దర్శకత్వంలో శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో ఈసినిమా వస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా నవంబర్ 24వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఈ నేపథ్యంలోనే ఈసినిమా నుండి ఇప్పటికే పలు పోస్టర్లు, టీజర్,పాటలు రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇక ఈసినిమా నుండి వచ్చిన లింగి లింగి లింగిడి అనే పాట ఎంత పాపులర్ అయిందో ఆపాటతో ఈసినిమాకు ఎంత బజ్ క్రియేట్ అయిందో చూశాం. ఇప్పుడు ఈసినిమా నుండి మరో పాటను రిలీజ్ చేశారు మేకర్స్. ఈసినిమా టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.
కాగా ఈసినిమాలో ఇంకా రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాస్ మరియు విద్యా కొప్పినీడి ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాకు రాజ్ మరియు మిధున్ ముకుందన్ సంగీతం అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: