నాన్నగారి చరిత్రకు ఇది ఘనమైన నివాళి

mahesh babu emotional post on krishna statue unveiling

అలనాటి దివంగత సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన సినిమాలతో నటనతో తెలుగు సినీ పరిశ్రమకు ఎంతో గుర్తింపుతెచ్చారు. సుమారు ఐదు దశాబ్దాల పాటు హీరో, నిర్మాత, దర్శకుడిగా అన్నీ పాత్రలు పోషించిన కృష్ణ 300పైగా చిత్రాల్లో నటించారు. ఇక గత ఏడాది నవంబర్ 15వ తేదీన ఆయన మరణించిన సంగతి తెలిసిందే కదా. అయితే తాజాగా సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని విజయవాడలో ఆవిష్కరించారు. విజయవాడలోని గురునానక్ కాలనీలో ఏర్పాటు చేసిన విగ్రహాన్న దేవినేని అవినాష్ తో కలిసి లోకనాయకుడు కమలహాసన్ ఆవిష్కరించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక దీనిపై స్పందించిన మహేష్ తన ట్విట్టర్ ద్వారా స్పందించారు. కమల్ హాసన్ గారు ఇంకా అవినాష్ గారు మానాన్న గారి విగ్రహాన్ని ఆవిష్కరించినందుకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. వారు నాన్న గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం నిజమైన గౌరవంగా భావిస్తున్నాను. నాన్న గారు వదిలి వెళ్లిన ఘనమైన చరిత్రకు ఇది నివాళి వంటిది. ఇంకా ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు తోడ్పడిన అభిమానులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అంటూ ట్వీట్ లో పేర్కొన్నాడు.

కాగా మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా గుంటూరు కారం. ఈసినిమాలో మహేష్ బాబు సరసన మీనాక్షి చౌదరి అలానే శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. మధి కెమెరామెన్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా, థమన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై ఎస్.రాధాకృష్ణ ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఆతరువాత రాజమౌళి తో తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ను చేయనున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + 10 =