గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ ‘భగవంత్ కేసరి’ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని బాక్సాఫీస్ కా షేర్‌గా నిలిచింది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా, శ్రీలీల కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం, ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి, అభిమానులు, ప్రేక్షకులు, విమర్శకులందరి ప్రశంసలు అందుకొని అఖండ విజయం సాధించింది. ‘భగవంత్ కేసరి’ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతూ బాక్సాఫీస్ వద్ద రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ సాధించి నందమూరి బాలకృష్ణ కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ మూవీగా నిలిచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ గురువారం హైదరాబాద్‌లో గ్రాండ్ బాక్సాఫీస్ కా షేర్ సెలబ్రేషన్స్‌ని నిర్వహించారు. ఇక ఈ వేడుకలో ప్రముఖ నిర్మాత అంబికా కృష్ణ ఆత్మీయ అతిధిగా పాల్గొనగా.. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు ఈ వేడుకల్లో ముఖ్యఅతిధిగా పాల్గొని చిత్ర బృందానికి షీల్డ్స్ అందించారు. ఈ సందర్భంగా దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. “భగవంత్ కేసరి సినిమా అన్నీ థియేటర్స్‌లో ఇంకా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతూ దీపావళి చిచ్చుబుడ్డిలా వెలుగుతూనే వుంది. ఆ వెలుగు నిర్మాతల కళ్ళలో కనిపిస్తోంది. బాలయ్య బాబు బాంబ్ లాంటి వాడు. ఆయన డైలాగ్ చెబితే బాంబ్ పేలుతుంది. యాక్షన్ సీన్స్‌లో బాంబ్ దద్దరిల్లులుతుంది. కానీ ఇందులో బాంబ్ కళ్ళ నీళ్ళు పెట్టుకోవడం కనిపించింది. బాంబ్ కళ్ళ నీళ్ళు పెట్టుకోవడం ఫస్ట్ టైమ్ చూశాను” అని అన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “ఒక సన్నివేశంలో బాలయ్య బాబు వాళ్ళ నాన్న (విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు) గారిని గుర్తు తెచ్చారు. అంత అద్భుతంగా చేశారు. బాలయ్య బాబు ఇంకా గొప్ప గొప్ప సినిమాలు చేయాలి. బాలయ్య బాబుకి కాలాలతో సంబంధం లేదు. ఏ కాలంలోలైన జై బాలయ్య నినాదం ఓకే మంత్రంలా వినిపిస్తుంది. బాలయ్య విజయపతాకం ఎప్పుడూ ఇలా ఎగురుతూనే వుండాలి. శ్రీలీల.. ఏ పాత్రనైనా అవలీలగా చేస్తుంది. ఇందులో అన్ని ఎమోషన్స్ అద్భుతంగా చేసింది. తమన్ పాటలు నేపధ్య సంగీతం గొప్పగా చేశాడు. టీం అంతా కలిసికట్టుగా అద్భుతంగా పని చేసింది. దర్శకుడు అనిల్ రావిపూడి అన్ని రకాల సినిమాలు అద్భుతంగా చేయగలడని మరోసారి నిరూపించుకున్నారు. ‘భగవంత్ కేసరి’ తన కెరీర్ లో ఒక టర్నింగ్ పాయింట్ గా నిలుస్తుంది. చిత్ర యూనిట్ అందరికీ అభినందనలు’’ అని తెలిపారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: