
ట్యాగ్ · 17286 కథనాలు · పేజీ 253


జిగర్ తండ డబల్ ఎక్స్ పై ధనుష్ రివ్యూ

8000 ఆర్టిస్టులతో ఇండియన్ 2 షూట్

కంగువ ఫైనల్ షెడ్యూల్ షురూ

పొలిమేర 2 లేటెస్ట్ కలెక్షన్స్

కెప్టెన్ మిల్లర్ నుండి సందీప్ ఇంటెన్స్ లుక్

మంగళవారంకు అల్లు అర్జున్ సాయం

ఆకట్టుకుంటున్న విక్రమ్ ధ్రువ నక్షత్రం తెలుగు ట్రైలర్

సలార్ ట్రైలర్ డేట్ ఫిక్స్

కన్నప్ప కోసం.. 'పెదరాయుడు' లెజెండ్స్ కలిసిన వేళ

ఈగల్ నుండి రాబోతున్న క్రేజీ అప్ డేట్

నాని టాప్ త్రీ లవ్ స్టోరీస్

సలార్ రిలీజ్ పై మరోసారి క్లారిటీ

కన్ఫామ్.. ఇళయరాజా బయోపిక్ లో ధనుష్
ఇప్పటి వరకూ ఎన్నో బయోపిక్ లు వచ్చాయి. ఎంతోమంది ప్రముఖుల బయోపిక్ లు వచ్చి అలరించాయి. ఇప్పుడు మరో లెజెండ్ బయోపిక్ రాబోతుంది. ఆ బయోపిక్ ఎవరిదో కాదు భాషతో సంబంధం లేకుండా ఎన్నో చిత్రాలకు మ్యూజిక్ అందించిన ఇళయరాజా ది.

విజయవాడలో సూపర్‌స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించిన కమల్ హాసన్
దివంగత నటుడు, టాలీవుడ్ సూపర్‌స్టార్ ఘట్టమనేని కృష్ణ విగ్రహావిష్కరణ విజయవాడలో ఘనంగా జరిగింది. కాగా నగరంలోని స్థానిక గురునానక్ కాలనీ వద్ద గల కేడీజీవో పార్కులో సూపర్‌స్టార్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం (నవంబర్ 10, 2023) కృష్ణ విగ్రహాన్ని కోలీవుడ్ స్టార్ హీరో, ఉలగనాయగన్ కమల్ హాసన్ ఆవిష్కరించారు. నేటి ఉదయం జరిగిన ఈ కార్యక్రమానికి అధికార వైసీపీ నేత దేవినేని అవినాష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కృష్ణ, మహేష్ బాబు అభిమానులు భారీగా తరలివచ్చారు. విగ్రహావిష్కరణ అనంతరం కమల్ హాసన్ సూపర్ స్టార్ అభిమానులకు చేతులు ఊపి అభివాదం తెలిపారు.

సత్యభామ టీజర్ రిలీజ్.. పోలీస్ ఆఫీసర్‌గా కాజల్ నటన ఎలా ఉందంటే?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇటీవలే 'భగవంత్ కేసరి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కోసం ఆమె తొలిసారిగా గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణతో జోడీకట్టింది. దసరా పండుగ సందర్భంగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఆ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న ఆమె ప్రస్తుతం 'సత్యభామ' అనే ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటిస్తోంది. కాగా ఇది కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోన్న 60వ సినిమా కావడం గమనార్హం. ఇందులో కాజల్‌తో పాటు విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్, ట్యాలెంటెడ్ యాక్టర్ నవీన్‌చంద్ర కీలక పాత్రలు పోషిస్తోన్నారు. వచ్చే ఏడాది సమ్మర్…

జిగర్ తండ డబల్ ఎక్స్ పై ధనుష్ రివ్యూ
కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన జిగర్ తండ ఎంత సూపర్ హిట్ అయిందో తెలిసిందే కదా. ఇక ఇప్పుడు ఈసినిమాకు సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే. జిగర్ తండ డబుల్ ఎక్స్ అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. ఈసినిమాలో లారెన్స్,ఎస్.జే సూర్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఎన్నో అంచనాల మధ్య నేడు ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈసినిమా ఎలాంటి టాక్ తెచ్చుకుంటుంది అనే చూడాలి.

దాసరిని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురైన బాలకృష్ణ
టాలీవుడ్ స్టార్ హీరో, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘భగవంత్ కేసరి'. ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాలో ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా.. శ్రీలీల మరో కీలక పాత్రలో కనిపించింది. అలాగే బాలీవుడ్ యాక్టర్, నేషనల్ అవార్డ్ విన్నర్ అర్జున్ రాంపాల్ విలన్ రోల్ ప్లే చేశారు. కాగా 'భగవంత్ కేసరి' సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదలైన విషయం తెలిసిందే. మొదటి షో నుంచే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా…

8000 ఆర్టిస్టులతో ఇండియన్ 2 షూట్
లోకనాయకుడు కమల్ మాత్రం ఈ వయసులో కూడా యంగ్ హీరోలకు సైతం పోటీ ఇస్తూ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఇప్పటికే పలు సినిమాలు షూటింగ్ దశలో ఉండగా.. పలు సినిమాలు లైనప్ లో ఉన్నాయి. ఇండియన్ 2, కల్కి2898ఏడీ సినిమాలు షూటింగ్ దశలో ఉండగా రీసెంట్ గానే మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న థగ్ లైఫ్ సినిమాను కూడా మొదలుపెట్టాడు. ఇవి కాకండా ఇంకా లోకేష్ కనగరాజు దర్శకత్వంలో అలానే హెచ్.వినోథ్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు.

కంగువ ఫైనల్ షెడ్యూల్ షురూ
శివ దర్శకత్వంలో సూర్య హీరోగా వస్తున్న సినిమా కంగువ. హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో.. ఈ సినిమా 1000 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి గ్లింప్స్ ను అలానే పలు పోస్టర్లను రిలీజ్ చేయగా అవి సినిమాపై క్యూరియాసిటీని పెంచేశాయి. ఇక దాదాపు ఈసినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అయితే తాజాగా ఈసినిమా షూటింగ్ అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఈసినిమా ఫైనల్ షెడ్యూల్ ను నేడు చెన్నైలో మొదలుపెట్టింది చిత్రయూనిట్. చెన్నైలోని ఈవీపీ ఫిలిం సిటీలో ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈ షూటింగ్ లో సూర్యతో…

పొలిమేర 2 లేటెస్ట్ కలెక్షన్స్
దసరా సినిమాలు బాక్సాఫీస్ వద్ద కాస్త నెమ్మదించడంతో రీసెంట్ గా విడుదలైన సినిమాలు అదరగొడుతున్నాయి.అందులో భాగంగా గత వారం విడుదలైన మా ఊరి పొలిమేర 2 సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంది.మౌత్ టాక్ బాగుండడంతో ఈసినిమా 6రోజుల్లో 14.7కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.ఇందులో షేర్ 7కోట్లకు పైనే.కేవలం 4కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగడంతో ఇప్పటికే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేసుకొని బయ్యర్లకు భారీ లాభాలను అందిస్తుంది.ఫుల్ రన్ లో ఈసినిమా 20కోట్ల గ్రాస్ ను చేరుకొనే అవకాశం లేకపోలేదు.

కెప్టెన్ మిల్లర్ నుండి సందీప్ ఇంటెన్స్ లుక్
అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా వస్తున్న సినిమా కెప్టెన్ మిల్లర్. 1930 - 40ల బ్రిటిష్ కాలం నాటి పీరియాడిక్ మూవీగా పుల్ యాక్షన్ తో ఈసినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. టీజర్ అయితే మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

మంగళవారంకు అల్లు అర్జున్ సాయం
ఆర్ ఎక్స్ 100తో సెన్సేషనల్ హిట్ ఇచ్చినటువంటి డైరెక్టర్ అజయ్ భూపతి నుండి వస్తున్న మూడో సినిమా మంగళవారం.టైటిల్ ఆసక్తిని క్రీయేట్ చేయగా రీసెంట్ గా విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాకు హైప్ ను తీసుకొచ్చింది.ముఖ్యంగా ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకుంది. ఇక ఈ హైప్ ను ఇంకా పెంచడానికి ఓ స్టార్ హీరోను వాడుకుంటుంది చిత్ర బృందం.అందులో భాగంగా ప్రీరిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసింది.ఈవెంట్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథి గా రానున్నాడు.ఈ శనివారం ఈఈవెంట్ హైదరాబాద్ లోని జె ఆర్ సి కన్వెన్షన్ లో సాయంత్రం 6గంటలకు జరుగనుంది.

ఆకట్టుకుంటున్న విక్రమ్ ధ్రువ నక్షత్రం తెలుగు ట్రైలర్
మొత్తానికి ఎంతోకాలంగా పెండింగ్ లో ఉన్న విక్రమ్ ధ్రువనక్షత్రం సినిమా రిలీజ్ కాబోతుంది. తమిళ్ లో ధృవ నచ్చత్తిరం అంటూ రిలీజ్ అవుతుండగా.. తెలుగులో ధ్రువ నక్షత్రం టైటిల్ తో రిలీజ్ అవుతుంది. స్పై యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈసినిమాలో.. జాన్ అనే స్పై క్యారెక్టర్ లో నటిస్తున్నాడు విక్రమ్. ఈ సినిమా 2017లోనే రిలీజ్ అవ్వాలి కానీ అప్పటినుండీ పెండింగ్ లోనే ఉంది. ఫైనల్లీ ఈనెల 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు మేకర్స్.

సలార్ ట్రైలర్ డేట్ ఫిక్స్
మచ్ అవైటెడ్ సలార్: పార్ట్ 1 సీజ్ ఫైర్ ట్రైలర్ రిలీజ్ కు డేట్ ఫిక్స్ అయ్యింది.ఈ ట్రైలర్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు.ఇక ఇప్పుడు రిలీజ్ డేట్ ను లాక్ చేశారు మేకర్స్.డిసెంబర్ 1న ఈట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.మరోవైపు ఈసినిమా రిలీజ్ వాయిదాపడుతుందని నిన్నటి నుండి వార్తలు వస్తున్నాయి.ఇక ఈవిషయంలో కూడా క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తుంది.రీసెంట్ గా ప్రకటించిన డేట్ ప్రకారం డిసెంబర్ 22నే విడుదలకానుందని నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లకు చెప్పేశారట.దాంతో 22న విడుదల పక్కాఅయ్యినట్లే.

కన్నప్ప కోసం.. 'పెదరాయుడు' లెజెండ్స్ కలిసిన వేళ
టాలీవుడ్ డైనమిక్ స్టార్ విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘భక్త కన్నప్ప’. ‘కన్నప్ప’ పేరుతో ఆయన ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ ‘కన్నప్ప’ సినిమాలో విష్ణు మంచు టైటిల్ రోల్‌లో నటిస్తుండగా.. భారతదేశంలోని స్టార్ కాస్టింగ్ భాగం కానుంది. కాగా ఈ సినిమాలో చాలా సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయని హీరో మంచు విష్ణు ఇదివరకే ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. దీనిలో భాగంగా మోహన్ లాల్, శివ రాజ్‌కుమార్, ప్రభాస్, శరత్ కుమార్ వంటి అగ్రనటులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ సినిమా న్యూజిలాండ్‌లోని అందమైన లొకేషన్లలో షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ…

సప్త సాగరాలు దాటి సైడ్ బి.. ఈసినిమా ప్రేక్షకులను మరింత మెప్పిస్తుంది
కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి హీరోగా కన్నడలో వచ్చిన సప్త సాగరాలు దాటి సైడ్ ఏ సినిమా ఎంత హిట్ అయిందో తెలిసిందే కదా. ఇక ఇప్పుడు సెకండ్ పార్ట్ వస్తుంది. ఫస్ట్ పార్ట్ బాగా హిట్ అవ్వడంతో సప్త సాగరాలు దాటి సైడ్ బి కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుగులో ఈసినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి. విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈనెల 17వ తేదీన ఈసినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

ఈగల్ నుండి రాబోతున్న క్రేజీ అప్ డేట్
మాస్ మహారాజా రవితేజ మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇప్పటికే ఈఏడాది పలు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాగా ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న సినిమా ఈగల్. ఈసినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి రానుంది. దీంతో ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులన ముగించుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టింది.

నాని టాప్ త్రీ లవ్ స్టోరీస్
న్యాచురల్ స్టార్ నాని ఈఏడాది ఇప్పటికే దసరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. శౌర్యువ్ దర్శకత్వంలో నాని హీరోగా వస్తున్న సినిమా హాయ్ నాన్న. లవ్ ప్లస్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈసినిమాపై మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఇక ఈసినిమాను డిసెంబర్ 7వ తేదీన రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలన కూడా మొదలుపెట్టారు.

రేపు విజయవాడలో కమల్ హాసన్ చేతులమీదుగా.. సూపర్ స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ
దివంగత నటుడు, టాలీవుడ్ సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ విగ్రహావిష్కరణ శుక్రవారం (నవంబర్ 10, 2023) విజయవాడలో జరుగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోలీవుడ్ స్టార్ హీరో, ఉలగనాయగన్ కమల్ హాసన్ హాజరు కానున్నారు. రేపు ఉదయం గం. 7:02 ని.లకు ఆయన చేతులమీదుగానే కృష్ణ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరుగనుంది. ఈ వేడుకకు గురునానక్ కాలనీలోని స్టార్‌బర్క్స్ పక్కనున్న కేడీజీవో పార్కు వేదిక కానుంది. కాగా కమల్ హాసన్ ప్రస్తుతం 'ఇండియన్ 2' చిత్రం షూటింగ్‌లో భాగంగా విజయవాడలో ఉన్నారు. ఈ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు యూనిట్ వర్గాలు తెలిపాయి.

సలార్ రిలీజ్ పై మరోసారి క్లారిటీ
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా సలార్. రెండు భాగాలుగా ఈసినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. దీనిలో ఫస్ట్ పార్ట్ డిసెంబర్ లో రిలీజ్ కానుంది. సలార్-సీజ్ ఫైర్ అంటూ వచ్చే ఈ పార్ట్ డిసెంబర్ 22వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను చిన్నగా మొదలుపెట్టారు. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ముగించుకునే పనిలో ఉంది.

అమితాబ్ బచ్చన్ కామెంట్స్‌తో.. మరోసారి ట్రెండింగ్‌లోకి 'పుష్ప'
బాలీవుడ్ సూపర్ స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప’పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ 15వ సీజన్ ఇందుకు వేదికైంది. ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్‌కి సంబంధించిన ప్రశ్నను అడిగారు బిగ్‌బీ. కాగా కార్యక్రమంలో భాగంగా ఓ కంటెస్టెంట్‌కు ఆయన ‘ఈ ఏడాది జాతీయ ఉత్తమ నటుడు ఎవరు?’ అనే ప్రశ్నను సంధించారు. ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్ ‘పుష్ప’ సినిమా గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘పుష్ప’ చిత్రంలోని ‘శ్రీవల్లి’ పాటను ప్రస్తావిస్తూ బన్నీని అభినందించారు.

ఓవర్సీస్ లో లియో సంచలన కలెక్షన్స్
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో దళపతి విజయ్, త్రిష హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా లియో. ఈసినిమా ఎన్నో అంచనాల మధ్య అక్టోబర్ 20వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకువచ్చింది. ఇక ఫస్ట్ షో నుండే ఈసినిమా మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. లోకేష్ మేకింగ్, విజయ్ యాక్టింగ్ ముఖ్యంగా అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈసినిమాకు మంచి ప్లస్ పాయింట్స్ అయ్యాయి.