మంగళవారంలో ఆ సాంగ్ ఉండదట  

Appadappada Tandra song removed from mangalavaaram

ట్రైలర్ తో మంచి బజ్ ను క్రీయేట్ చేయగలిగింది మంగళవారం అనే సినిమా.ప్రీరిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగింది.ఆర్ ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి నుండి వస్తున్న సినిమా ఇది.థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో  తెరకెక్కించాడు.పాయల్ రాజ్ పుత్  మెయిన్ లీడ్ గా నటించింది.ఆర్ ఎక్స్ 100లో బోల్డ్  గా కనిపించిన పాయల్ ఈసినిమాలో మరింతగా రెచ్చిపోయిందట.ఇక ఈసినిమానుండి ఇటీవల ఓసాంగ్ ను రిలీజ్ చేశారు.యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఈసాంగ్ లో కనిపించాడు.అదే అప్పడప్పడ తాండ్ర సాంగ్.యూ ట్యూబ్ లో మంచి వ్యూస్ ను రాబట్టుకుంది.అయితే ఈ సాంగ్ థియేట్రికల్ వెర్షన్ లో ఉండదట.ఈవిషయాన్ని అజయ్ భూపతి వెల్లడించాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సెన్సార్ వాళ్ళు సాంగ్ లో రెండు లైన్లు చేంజ్ చేయమన్నారు అయితే ఆ లైన్లు మారిస్తే సాంగ్ లో ఫీల్ పోద్ది అందుకే సాంగ్ ను తీసేయాల్సి వచ్చిందని ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.థియేట్రికల్ వెర్షన్ నుండి తీసేసారు కానీ ఓటిటి  వెర్షన్ లో మాత్రం ఈసాంగ్ ను ఆడ్ చేసే అవకాశం వుంది.

ఇక ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు హైదరాబాద్ లోని జెఆర్సీ కన్వెన్షన్ లో జరుగనుంది.ఈఈవెంట్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా రానున్నాడు.నందితా శ్వేతా,అజ్మల్,అజయ్ ఘోష్ తదితరులు కీలకపాత్రలు పోషించిన ఈసినిమాకు అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించాడు.స్వాతి గుణాపాటి,సురేష్ వర్మ సంయుక్తంగా నిర్మించారు.ఈ నెల 17న మంగళవారం పాన్ ఇండియా మూవీ గా విడుదలకానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + sixteen =