గేమ్ ఛేంజర్- ఫ్యాన్స్ కు నిరాశ.. జరగండి సాంగ్ పోస్ట్ పోన్

Game Changer Telugu Movie First Single Release Postponed

రామ్ చరణ్ ఫ్యాన్స్ కు మరోసారి నిరాశ ఎదురైంది. రామ్ చరణ్ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ దీపావళి కి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. జరగండి అంటూ ఈపాట వస్తుంది. ఇక పోస్టర్లు కూడా కలర్ ఫుల్ గా ఉండటంతో ఈపాట కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు మేకర్స్ ఇచ్చిన ట్విస్ట్ కు మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఈపాట రిలీజ్ పోస్ట్ పోన్ చేస్తున్నట్టు ఇప్పటికే వార్తలు మొదలయ్యాయి. ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ పాట రిలీజ్ ను పోస్ట్ పోన్ చేస్తున్నట్టు ప్రకటించారు. కొన్ని ఆడియో డాక్యుమెంటేషనన్ ఇష్యూస్ వల్ల ఈపాట రిలీజ్ ను వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. త్వరలోనే అప్ డేట్ తో వస్తామని.. రామ్ చరణ్ ప్యాన్స్, శంకర్ ఫ్యాన్స్ వెయిటింగ్ కు వర్త్ ఉంటుంది.. ఈసినిమా నుండి వచ్చే ప్రతి అప్ డేట్ బెస్ట్ గా ఉంటుందని తెలిపాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ఈసినిమా వస్తుంది. భారీ బడ్జెట్ తో భారీ బడ్జెట్ తో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈసినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో అంటే అటు ఐఏఎస్ పాత్రలో మరోవైపు గ్రామస్థుడిగా కనిపించనున్నాడు. గేమ్ ఛేంజర్ సినిమాలో కియారా హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా ఈసినిమాలో శ్రీకాంత్, జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + 14 =