టాలీవుడ్‌లో విషాదం.. నటుడు చంద్రమోహన్ కన్నుమూత

Tollywood Senior Actor Chandra Mohan Passed Away

టాలీవుడ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్‌ నటుడు చంద్రమోహన్‌ మృతి చెందారు. 80 సంవత్సరాల ఆయన గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా చంద్రమోహన్ గుండె సంబంధిత సమస్యతో హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ఈ నేపథ్యంలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శనివారం తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు చంద్రమోహన్ ఈ ఉదయం 9.45 గంటలకు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీంతో ఒక్కసారిగా తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. కాగా ఆయనకు భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇక చంద్రమోహన్ మృతిపై పలువురు టాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అలాగే సోషల్ మీడియా వేదికగా ఆయన అభిమానులు సంతాపం తెలుపుతున్నారు. కాగా చంద్రమోహన్ అంత్యక్రియలను సోమవారం హైదరాబాద్ మహాప్రస్థానంలో నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలియజేశారు.

చంద్రమోహన్ ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లాలోని పమిడిముక్కల గ్రామంలో 1943 మే 23న జన్మించారు. ఆయన అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర రావు. సినిమా రంగంపై ఆసక్తితో చెన్నై వెళ్లి అవకాశాలకోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో 1966లోవచ్చిన ‘రంగుల రాట్నం’ చిత్రంతో ఆయన తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. తొలుత కామెడీ మరియు నెగిటివ్ రోల్స్ లో కనిపిస్తూ.. ఆపై హీరోగా ప్రమోషన్ అందుకున్నారు. అనంతరం క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా కూడా చేశారు. ఈ క్రమంలో పలు తమిళ సినిమాల్లోనూ నటించిన చంద్రమోహన్ చివరిగా గోపీచంద్‌ హీరోగా తెరకెక్కిన ‘ఆక్సిజన్’ చిత్రంలో కనిపించారు. ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి కె విశ్వనాథ్ గారికి చంద్రమోహన్ దగ్గరి బంధువు.

ఇక తన సుదీర్ఘ కెరీర్ లో మొత్తం 400లకు పైగా చిత్రాల్లో నటించిన ఆయన, తన నటనకు గానూ ఫిలింఫేర్‌, నంది అవార్డులు సైతం అందుకున్నారు. 1987లో ‘చందమామ రావే’ సినిమాకు ఉత్తమ హాస్యనటుడిగా నంది అవార్డు, 2005లో ‘అతనొక్కడే’ సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా రెండు నంది పురస్కారాలు, మరియు ‘పదహారేళ్ల వయసు’, ‘సిరి సిరి మువ్వ’ సినిమాల్లో నటనకు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్‌ అవార్డులు దక్కించుకున్నారు. ఈ లెజెండరీ నటుడి మృతికి తెలుగు ఫిల్మ్ నగర్ తరపున సంతాపం వ్యక్తం చేస్తూ.. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 1 =