హరోం హర నుండి సునీల్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

sunil first look poster released from harom hara movie

ఈ ఏడాది ఇప్పటికే హంట్ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు సుధీర్ బాబు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో హరోం హర సినిమా కూడా ఒకటి. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం అయితే శరవేగంగా జరుపుకుంటుంది. ఆమధ్య ఈసినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేయగా అది బాగానే ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా నుండి అప్ డేట్ వచ్చి చాలా రోజులైపోయింది. అయితే ఇప్పుడు ఈసినిమా నుండి మరో అప్ డేట్ వచ్చింది. తాజాగా ఈసినిమాలో నటిస్తున్న సునీల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. సీరియస్ లుక్ లో ఉన్న సునీల్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఈసినిమాలో సునీల్ పళని సామి అనే పాత్రలో నటిస్తున్నాడు.

కాగా కుప్పం నేపథ్యంలో డివైన్ టచ్ తో ఈసినిమా రానున్నట్టు అర్థమవుతుంది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్‌ బ్యానర్‌ పై సుమంత్‌ జీ నాయుడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అరవింద్ విశ్వనాథన్ సినిమా సినిమాటోగ్రఫీ.. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 22వ తేదీన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ గా విడుదల కానుంది..

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.