హిట్ అయిన సినిమాలను వేరే భాషలో రిలీజ్ చేయడం ఇప్పుడు కామన్ అయిపోయింది. ఈనేపథ్యంలోనే ఇప్పటికే మన తెలుగు సినిమాలు హిందీలో రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు మరో బ్లాక్ బస్టర్ సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఆ బ్లాక్ బస్టర్ సినిమా మరేదో కాదు రీసెంట్ గా వచ్చి ప్రేక్షకాదరణ పొందిన భగవంత్ కేసరి సినిమా. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా మాస్ ప్లస్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా వచ్చింది. ఈసినిమా అందరికీ నచ్చడంతో సూపర్ హిట్ అయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాను హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని బాలకృష్ణ కూడా కన్ఫామ్ చేశారు. ఈసినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ నిన్న జరిగిన సంగతి తెలిసిందే కదా. ఈ ఈవెంట్ లో పాల్గొన్న బాలకృష్ణ ఈసినిమాను హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నామని.. హిందీలో తనే సొంత డబ్బింగ్ చేశానని.. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుందని.. త్వరలో రిలీజ్ డేట్ వస్తుందని తెలిపారు. మరి చూద్దాం అక్కడ ఈసినిమా ఎంత ప్రభంజనం సృష్టిస్తుందో..
కాగా కాజల్ హీరోయిన్ గా నటించగా శ్రీలీల మరో కీలక పాత్రలో నటించింది. ఇప్పటివరకూ గ్లామర్ రోల్స్ చేసిన శ్రీలీల ఈసినిమాలో పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ రోల్ చేసింది. అర్జున్ రాంపాల్ విలన్ పాత్రలో నటించాడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈసినిమాకు
సినిమాటోగ్రఫి.. సి.రామ్ ప్రసాద్, సంగీతం.. ఎస్ థమన్ అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: