హీరో సిద్దార్థ్ తన సినిమాలతో తెలుగులో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఆతరువాత కొత్త కొత్త హీరోలు రావడం.. మరోవైపు సిద్దార్థ్ కూడా వరుస పరాజయాలు అందుకోవడంతో సినిమా అవకాశాలు కాస్త తగ్గాయి. మళ్లీ ఇప్పుడు కెరీర్ లో నిలదొక్కుకుంటున్నాడు. ఇక ఇప్పుడు నిర్మాతగా కూడా మారాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఎస్.యు.అరుణ్ కుమార్ దర్శకత్వంలో సిద్దార్థ్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా చిన్నా. ఈసినిమాను సిద్దార్థ్ నిర్మించారు. ఎమోషనల్ థ్రిల్లర్ గా వచ్చిన ఈసినిమా తమిళ్ లో రిలీజ్ అయి అక్కడ సూపర్ హిట్ అవ్వడంతో ఇక్కడ కూడా రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది ఈసినిమా. ఇక ఇప్పుడు ఈసినిమా ఓటీటీలోకి కూడా రాబోతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+ ప్లస్ హాట్ స్టార్ వారు ఈసినిమా హక్కులను సొంతం చేసుకోగా తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. ఈ నవంబర్ 17 న ఈసినిమాను ఓటీటీలో రిలీజ్ చేయనుంది. మరి థియేటర్ లో చూడనివారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.
కాగా ఈసినిమాలో ఇంకా నిమిషా విజయన్, సహస్ర శ్రీ, అంజలి నాయర్ పలు కీలక పాత్రల్లో నటించారు.ఈసినిమాను ఎటాకి సంస్థ నిర్మించింది. తెలుగులో ఆసియన్ సినిమాస్ వారు రిలీజ్ చేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























