టీఆర్పీ రేటింగ్స్ లో అదరగొట్టిన ఆదిపురుష్

adipurush got solid trp ratings

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మైథలాజికల్ మూవీ ఆదిపురుష్ ఈ జూన్ లో విడుదలై 500కోట్లకు పైగా వసూళ్లను రాబట్టుకుంది.రామాయణం ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఈసినిమాలో ప్రభాస్ రాముడిగా నటించగా సీతగా కృతి సనన్ రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ కనిపించారు. ఇక ఈసినిమా టీవీ లో కూడా సూపర్ హిట్ అనిపించుకుంది. ఈసినిమా ను స్టార్ మా మొదటి సారి అక్టోబర్ 29న వరల్డ్ ప్రీమియర్ మూవీ గా టెలికాస్ట్ చేయగా 10.6 రేటింగ్స్ ను రాబట్టుకుంది.అజయ్ అతుల్ ఈసినిమాకు సంగీతం అందించగా భూషణ్ కుమార్ ,ప్రసాద్ సుతార్, కృష్ణన్ కుమార్ ,వంశీ ,ప్రమోద్ కలిసి నిర్మించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలావుంటే ఈసినిమా తరువాత ప్రభాస్,సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ తో పలకరించనున్నాడు.ఈసినిమా ఈ డిసెంబర్ 22న విడుదలకానుంది.కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాఫై భారీ అంచనాలు వున్నాయి.ఈసినిమా ట్రైలర్ ను ఈ డిసెంబర్ 1న విడుదలచేయనున్నారు.ఇక ఈసినిమాకాకుండా ప్రభాస్ ప్రస్తుతం మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో కల్కి 2989 ఏడి అలాగే మారుతీ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు.అయితే మారుతీ తో చేస్తున్న సినిమా ను ఇంతవరకు ఆఫిషియల్ గా ప్రకటించలేదు. ఈ రెండు సినిమాలు కూడా వచ్చే ఏడాది విడుదలకానున్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 5 =