ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్- యూత్ ఫుల్ బ్రష్ వేసుకో సాంగ్ రిలీజ్

Brush Vesko song released from nithiins Extra Ordinary Man movie

సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అయితే మంచి హిట్ కోసం మాత్రం ఎప్పటినుండో వెయిట్ చేస్తున్నాడు. భీష్మ తరువాత ఇప్పటివరకూ సరైన సక్సెస్ ను అందుకోలేకపోయిన నితిన్ సరైన హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఈనేపథ్యంలోనే స్టార్ రైటర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్ అనే సినిమాతో వస్తున్నాడు. డిసెంబర్8వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టశారు మేకర్స్. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అంతేకాదు మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. దీనిలోభాగంగానే డేంజర్ పిల్లా అనే ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేయగా.. ఇప్పుడు సెకండ్ సాంగ్ ను రిలీజ్ చేశారు. బ్రష్ వేసుకో అంటూ వచ్చే ఈపాట ప్రోమో ను ఇప్పటికే రిలీజ్ చేయగా.. తాజాగా ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఫంకీ గా ఉన్న ఈపాట యూత్ ను ఆకట్టుకునేలా ఉంది.

కాగా ఈసినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. శ్రేష్ఠ్ మూవీస్, ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు హారిస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + 13 =