జిగర్ తండ డబుల్ ఎక్స్ టీమ్ పై తలైవా ప్రశంసలు

rajinikanth praises on jigarthanda doublex movie team

తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన జిగర్ తండ ఎంత సూపర్ హిట్ అయిందో తెలిసిందే కదా. ఇక ఈసినిమాకు సీక్వెల్ జిగర్ తండ డబుల్ ఎక్స్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ఈసినిమా రీసెంట్ గానే రిలీజ్ అయి మంచి టాక్ నే సొంతంచేసుకుంది. ఇక ఈసినిమాపై తలైవా రజనీకాంత్ తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ప్రశంసించారు. జిగర్ తండ డబుల్ ఎక్స్ మూవీ డిఫరెంట్ కథ, డిఫరెంట్ ప్లాట్.. కార్తీక్ సుబ్బరాజు అమేజింగ్ వర్క్ చేశావు.. కొన్ని సన్నివేశాలు మాత్రం ఇంతకుముందు సినిమా ఫ్యాన్స్ ఎప్పుడూ చూసినట్టు ఉండవు.. ఇక ఈసినిమాలో ప్రధాన పాత్రల్లో చేసిన రాఘవ లారెన్స్ అలానే ఎస్ జే సూర్య నటనను కూడా ప్రశంసించారు. ఈ రకమైన పాత్రలో లారెన్స్ నటన చూసి ఆశ్చర్యపోయాను.. ఇంకా విలన్ పాత్ర అయినా, కామెడీ, క్యారెక్టర్ రోల్ అయినా ఎస్ జే సూర్య పెర్ఫామెన్స్ ఎప్పుడూ అద్భుతంగా ఉంటుంది అని అన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇంకా మ్యూజిక్ కంపోజర్ సంతోష్ నారాయణన్ గురించి మాట్లాడుతూ.. డిఫరెంట్ సినిమాలకు డిఫరెంట్ మ్యూజిక్ ను కంపోజ్ చేయడంలో సంతోష్ నారాయణన్ కింగ్.. తన మ్యూజిక్ తో సినిమాకు లైఫ్ ను ఇచ్చాడు.. ఈసినిమాకు తను మాస్టర్ మ్యూజిక్ కంపోజర్ అని ప్రూవ్ చేశాడు అని అన్నారు. ఇంకా ఈసినిమాలో ఉపయోగించిన ఏనుగు పై కూడా ప్రశంసలు కురిపించారు. చివరలో నాపట్ల నాకు గర్వంగా ఉంది కార్తీక్ సుబ్బరాజు అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు తలైవా. ఇక తలైవా ట్వీట్ కు కార్తీక్ సుబ్బరాజు తన ట్విట్టర్ స్పందిస్తూ థ్యాంక్స్ చెప్పాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 5 =