టాలీవుడ్ అగ్రహీరో విక్టరీ వెంకటేష్ కూడా ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం వెంకీ నుండి రాబోతున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ సైంధవ్. యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. అంతేకాదు వెంకటేష్ కెరీర్ లో వస్తున్న 75వ సినిమా కావడంతో ఈసినిమాకోసం వెంకీ ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈ రోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్ ని విడుదల చేశారు. పోస్టర్ లో బేబీ సారాని బైక్ పై స్కూల్ కి తీసుకెళ్తూ చిరునవ్వుతో కనిపించారు వెంకటేష్. ఇది చిల్డ్రన్స్ డే కి పర్ఫెక్ట్ పోస్టర్ గా అందరినీ అలరించింది. ఇక ఇప్పటికే విడుదలైన ‘సైంధవ్ టీజర్ కు నేషనల్ వైడ్ గా ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది.
To our GAYATHRI PAPA & all the beautiful innocent souls out there ❤️🔥
Team #SAINDHAV wishes a blessed #ChildrensDay 😍❤️#SaindhavOnJAN13th 💥@VenkyMama @Nawazuddin_S @arya_offl @KolanuSailesh @ShraddhaSrinath @iRuhaniSharma @andrea_jeremiah @Music_Santhosh @NiharikaEnt… pic.twitter.com/fbgfkNhoKh
— Sailesh Kolanu (@KolanuSailesh) November 14, 2023
కాగా నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జెరెమియా, బేబీ సారా, జయప్రకాష్‌లు ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈసినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా.. ఎస్ మణికందన్ కెమెరామెన్ గా, గ్యారీ బిహెచ్ ఎడిటర్ గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. నిహారిక ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈసినిమాకు కిషోర్ తాళ్లూరు సహ నిర్మాత సైంధవ్ పాన్ ఇండియా చిత్రంగా అన్ని దక్షిణాది భాషలు, హిందీలో విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: