మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల దంపతులు దీపావళి పండుగ సందర్భంగా గత శనివారం రాత్రి తమ నివాసంలో గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తమ ముద్దులపట్టి క్లీంకార పుట్టిన తర్వాత వచ్చిన మొదటి దీపావళి కావడంతో వారు ఈ పార్టీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ పార్టీకి పలువురు టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. వీరిలో విక్టరీ వెంకటేశ్, కింగ్ నాగార్జున, సూపర్ స్టార్ మహేశ్‌బాబు-నమ్రత, యంగ్ టైగర్ ఎన్టీఆర్-ప్రణతి దంపతులు ఉన్నారు. అలాగే వీరితోపాటు మరికొందరు దర్శక, నిర్మాతలు కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలను నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా అవి విపరీతంగా వైరల్ అయ్యాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ముఖ్యంగా ఈ పార్టీలో మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్ హైలైట్‍గా నిలిచింది. ఈ మేరకు మెగాస్టార్ డాన్స్ చేసిన వీడియో ఒకటి తాజాగా బయటికి వచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘జవాన్’ సినిమాలోని టైటిల్ సాంగ్‍కు ఆయన డాన్స్ చేశారు. ప్రముఖ రాప్ సింగర్ రాజకుమారి పాట పాడుతుండగా.. మెగాస్టార్ తన మార్క్ గ్రేస్ స్టెప్‍లతో అదరగొట్టడం అందులో కనిపించింది. ఈ క్రమంలో రామ్ చరణ్ కూడా వారికి తోడుగా కాలు కదిపారు. దీంతో ఒక్కసారిగా అక్కడివారంతా కేకలతో వీరిని మరింతగా ఉత్సాహపరిచారు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో మెగా ఫ్యాన్స్ వయసు మీద పడుతున్నా.. బాస్ గ్రేస్ సూపర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
#TFNReels: Evergreen Grace Master🔥
Megastar @KChiruTweets dances for #Jawan song during the #Diwali party!🕺#Chiranjeevi #RamCharan #TeluguFilmNagar pic.twitter.com/wH3YtRY2Md— Telugu FilmNagar (@telugufilmnagar) November 14, 2023
ఇక ఇదిలా ఉండగా.. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘మెగా 156’ సినిమా చేయనున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాతలు వి వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్‌రెడ్డి కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ మూవీ చిరంజీవి కెరీర్‌లోనే మోస్ట్ ఎక్స్ పెన్సీవ్ చిత్రంగా వుండబోతోంది. ఇక తన తొలి చిత్రం ‘బింబిసార’తో మనల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్లిన వశిష్ట మల్లిడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పంచ భూతాల నేపథ్యంలో సోషియో ఫాంటసీ కథాంశంగా రూపొందనున్న ఈ సినిమాలో స్టార్ హీరోయిన్స్ నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి. కాగా ఈ జానర్‌లో చాలా సంవత్సరాల తర్వాత చిరంజీవి చేయనున్న చిత్రం కావడంతో దీనిపై అంచనాలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: