హనుమాన్ నుండి సూపర్ హీరో హనుమాన్ సాంగ్ రిలీజ్

hanuman movie first single released

టాలీవుడ్ ద‌ర్శ‌కుడు ప్రశాంత్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటినుండీ డిఫరెంట్ సినిమాలు చేస్తూ తనకుంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. అ!, కల్కి, జాంబిరెడ్డి ఇలా వేటికవే ప్రత్యేకమైన జోనర్లో వచ్చినవే. ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ జోనర్ తో వచ్చేస్తున్నాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా వస్తున్న సినిమా హనుమాన్. భార‌తీయ ఇతిహాసాల్లోని హనుమంతుని కథ స్ఫూర్తితో సూపర్ హీరోస్ నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీ అయిపోయింది. ఎన్నోసార్లు వాయిదా పడిన అనంతరం ఈసినిమా ఫైనల్ గా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా ప్రమోషన్స్ ను షురూ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే ఈసినిమా నుండి ప్రతి మంగళవారం రిలీజ్ వరకూ ఏదో ఒక అప్ డేట్ ఇస్తామని తెలిపారు. ఇక చెప్పినట్టే ఈ రోజు అప్ డేట్ తో వచ్చారు. అందులో ఈ రోజు చిల్డ్రన్స్ డే కాబట్టి అందుకు తగ్గట్టుగా పిల్లలకు గిప్ట్ గా ఒక అప్ డేట్ తో వచ్చారు. తాజాగా ఈసినిమా నుండి ఫస్ట్ పాటను రిలీజ్ చేశారు మేకర్స్. సూపర్ హీరో హనుమాన్ అంటూ వచ్చే ఈ పాట ఆకట్టుకుంటుంది.

కాగా ఈసినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. వరలక్ష్మీ శరత్ కుమార్ మరో కీలక పాత్రలో నటిస్తుంది. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో విజువ‌ల్ ఎఫెక్ట్స్‌కీ ప్రాధాన్యం ఉంది. ఈసినిమాను ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 11 భాషల్లో రిలీజ్ చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × five =