సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం తన కొత్త సినిమాతో బిజీగా ఉన్నాడు. సాయి ధరమ్ తేజ్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో వస్తున్న సినిమా గాంజా శంకర్. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈసినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. మ్యాడ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. రిషి పంజాబీ సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ను నిర్వహించాడు సాయి ధరమ్ తేజ్. ఈ సందర్బంగా నెటిజన్లు పలు ప్రశ్నలు సంధించారు. వాటిలో కొన్ని
చాలా ఇంటర్వ్యూల్లో చూశా మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరంటే సమంత అని చెప్పారు.. ఒకవేళ తనతో కనుక సినిమా చేసే అవకాశం వస్తే ఏ జోనర్ లో సినిమా తీస్తారు అని అడగగా.. దానికి తేజ్ ప్యూర్ లవ్ స్టోరీ అని చెప్పాడు.
A pure love story 🥰🥰🥰
— Sai Dharam Tej (@IamSaiDharamTej) November 14, 2023
ఇంకా ఎన్టీఆర్ అభిమాని..అన్న మీకు మా తారక్ అన్న కి ఉన్న స్నేహం లో ఒక చిన్న మూమెంట్.. మీ లైఫ్ లో గుర్తుండిపోయేది చెప్పవా అని అడుగగా.. దానికి సాయి తేజ్ అడిగిన వెంటనే నా సినిమా ఓపెనింగ్ కి వచ్చాడు.. సినిమా టీజర్ కి వాయిస్ ఓవర్ ఇచ్చాడు.. తన ఫ్రెండ్షిప్ కి ఎప్పుడు కృతజ్ఞుడిని అంటూ తెలిపాడు.
Adigana ventane naa cinema opening ki vachadu and naa cinema teaserki voiceover ichadu…I’m always grateful for his friendship
— Sai Dharam Tej (@IamSaiDharamTej) November 14, 2023
మరో నెటిజన్ మహేష్ సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏంటని అడుగగా.. మహేష్ అన్నసినిమాల్లో అతడు, ఖలేజా మరియు పోకిరి సినిమాలు నాకు ఇష్టం అని అన్నారు.
Athadu khaleja and pokirri are my favourite of Mahesh Anna’s films
— Sai Dharam Tej (@IamSaiDharamTej) November 14, 2023
చిన్న మామయ్య తో సినిమా అయిపోయింది పెద్ద మామయ్య తో సినిమా ఎప్పుడు అని అడుగగా.. ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను అని తెలిపారు.
I’m also waiting for the opportunity https://t.co/HqvehyNPAM pic.twitter.com/xKgzbptLMF
— Sai Dharam Tej (@IamSaiDharamTej) November 14, 2023
రామ్ చరణ్ కాంబో ఏమైనాా ఎక్స్ పెక్ట్ చేయొచ్చా అని అడుగుగా.. తప్పకుండా మంచి కథ కుదిరితే ఎంతో సంతోషిస్తాను అంటూ తెలిపాడు.
Definitely yes…manchi Kadha Kudirithe I’ll be the happiest ever 😊
— Sai Dharam Tej (@IamSaiDharamTej) November 14, 2023
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఒక్క మాటలో చెప్పమని అడుగగా గురువు గారు అంటూ సమాధానం ఇచ్చాడు.
Guru garu 🙏🏼 https://t.co/YiTMqflc7X
— Sai Dharam Tej (@IamSaiDharamTej) November 14, 2023
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: