
ట్యాగ్ · 1111 కథనాలు · పేజీ 44


అందుకే టాలీవుడ్ లో గ్యాప్ - మేఘ ఆకాష్

'లాల్ సింగ్ చద్దా' హైలెట్ గా చైతు ఎపిసోడ్

రష్యన్ బ్యూటీ లుక్ లో తమన్నా

"పుష్ప" సింగిల్ పై రష్మిక స్పందన

'అంటే సుందరానికి'.. సెకండ్ షెడ్యూల్ కంప్లీట్

కామ్నా జెఠ్మలానీ టాలీవుడ్ రీఎంట్రీ

"# RC15" మూవీ లో అంజలి ?

సేఫ్టీ ఫస్ట్ -శృతి హాసన్

'101 జిల్లాల అందగాడు' రిలీజ్ డేట్ ఖరారు

'ఇచ్చట వాహనములు నిలుపరాదు' రిలీజ్ డేట్ ఫిక్స్

కాకినాడ పోర్ట్ లో "లూసిఫర్ "

'మళ్ళీ మొదలైంది' లో పోసాని

'సలార్' షూటింగ్ పూర్తి చేసుకున్న శృతి హాసన్

"అఖండ"మూవీ షూటింగ్ పూర్తి

రజనీకాంత్ పై మేఘ ఆకాష్ ఆసక్తికర వ్యాఖ్యలు

'శేఖర్' షూటింగ్ రీ స్టార్ట్ చేసిన రాజ శేఖర్

"సలార్ "షూట్ పై శృతి హాసన్ అప్ డేట్

రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న 'గల్లీ రౌడీ'
థియేటర్లు ఓపెన్ అవ్వడంతో సినిమా రిలీజ్ ల సందడి మొదలైంది. ఇక మేకర్స్ కూడా ఏ మాత్రం లేట్ చేయకుండా తమ సినిమాలను వీలైనంత త్వరగా రిలీజ్ చేయడానికి చూస్తున్నారు. ఈనేథ్యంలోనే వారానికి కనీసం అరడజను సినిమాలైనా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి. ఇప్పుడు యంగ్ హీరో సందీప్ కిషన్ కూడా తన సినిమాకు రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసేశాడు. జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్, నేహాశెట్టి హీరోహీరోయిన్లుగా వస్తున్న కామెడీ ఎంటర్టైనర్ ‘గల్లీ రౌడీ’. ఈసినిమా కూడా రిలీజ్ కోసం ఎదురుచూస్తుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. “గల్లీ రౌడీ” సెప్టెంబర్ 3న రిలీజ్ అవుతున్నట్టు తెలిపారు.

అందుకే టాలీవుడ్ లో గ్యాప్ - మేఘ ఆకాష్
“లై “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన మేఘ ఆకాష్ , ఆ మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.”ఛల్ మోహన్ రంగ “మూవీ లో కథానాయికగా నటించిన మేఘ రజనీకాంత్ “పేట ” మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. “శాటిలైట్ శంకర్ ” మూవీ తో మేఘ బాలీవుడ్ కు ఎంటర్ అయ్యారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై హాసిత్ గోలి దర్శకత్వంలో శ్రీవిష్ణు , మేఘ ఆకాష్ జంటగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ "రాజ రాజ చోర "మూవీ 19 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం మేఘ ఆకాష్ పాత్రికేయులతో ముచ్చటించారు.

'లాల్ సింగ్ చద్దా' హైలెట్ గా చైతు ఎపిసోడ్
నాగచైతన్య ప్రస్తుతం హిందీ లో అమిర్ ఖాన్ నటిస్తున్న లాల్ సింగ్ చద్దా మూవీ లో ఓ ప్రత్యేక రోల్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇదిలా ఉండగా.. షూటింగ్ లో భాగంగా అమీర్ ఖాన్ తాజాగా అమలాపురం కూడా చేరుకున్నట్టు ఇప్పటికే పలు వార్తలు రావడం కూడా చూశాం. దీంతో పాటు ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా ఒకటి వినిపిస్తుంది. అదేంటంటే ఈసినిమాలో చైతు పాత్ర ఈసినిమాకు హైలెట్ గా నిలుస్తుందట.

రష్యన్ బ్యూటీ లుక్ లో తమన్నా
తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ తమన్నా స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. స్టార్ హీరోయిన్ తమన్నా కథానాయికగా రూపొందిన స్పోర్ట్స్ డ్రామా “సీటీ మార్ “ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఒకవైపు సినిమాలు మరోవైపు వెబ్ సిరీస్‌లతో తమన్నా బిజీగా ఉన్నారు. తమన్నా ప్రస్తుతం హిందీలో వెబ్ సిరీస్ తో పాటు “గుర్తుందా శీతాకాలం “, “F 3” మూవీస్ లో కథానాయికగా, ”మాస్ట్రో ” మూవీ లో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.

"పుష్ప" సింగిల్ పై రష్మిక స్పందన
మైత్రీమూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక జంటగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఫస్ట్ పార్ట్ “పుష్ప : ది రైజ్" మూవీ డిసెంబర్ 25 వ తేదీ రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

'అంటే సుందరానికి'.. సెకండ్ షెడ్యూల్ కంప్లీట్
సినిమా రిలీజ్ ల సంగతి పక్కన పెడితే సినిమాల షూటింగ్ లను మాత్రం పూర్తి చేసే పనిలో పడ్డాడు న్యాచురల్ స్టార్ నాని. ఇప్పటికే ఏప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న నాని టక్ జగదీష్ రిలీజ్ కు సిద్దంగా ఉంది. రీతువర్మ, ఐశ్వర్యా రాజేష్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాను... సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఇక ఈసినిమా తో పాటు శ్యామ్ సింగ రాయ్ సినిమాను కూడా ఇటీవలే పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

కామ్నా జెఠ్మలానీ టాలీవుడ్ రీఎంట్రీ
"ప్రేమికులు "(2005 )మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కామ్నా జెఠ్మలానీ "ఇదయ తిరుడన్ " మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. "రణం ", "బెండు అప్పారావు "వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో కామ్నా ప్రేక్షకులను అలరించారు. "సైనికుడు ", "కింగ్ " వంటి మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ తో కామ్నా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. పలు తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన కామ్నా 2014 సంవత్సరం లో వివాహం చేసుకుని మూవీస్ కు దూరం అయ్యారు.

"# RC15" మూవీ లో అంజలి ?
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ తమిళ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా “#RC15” మూవీ తెరకెక్కనుంది. హీరో రామ్ చరణ్ ఒక డైనమిక్ రోల్ లో నటించనున్న ఈ మూవీ హీరో రామ్ చరణ్ 15 వ మూవీ , శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై 50 వ మూవీ గా భారీ బడ్జెట్ తో రూపొందనుంది. కియారా అద్వానీ కథానాయిక .”#RC15” మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. సెప్టెంబర్ నెలలో సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ మూవీలో టాలెంటెడ్ యాక్ట్రెస్ అంజలి ఒక కీలక పాత్రకు ఎంపిక అయినట్టు సమాచారం.

సేఫ్టీ ఫస్ట్ -శృతి హాసన్
మల్టీ టాలెంటెడ్ శృతి హాసన్ కథానాయిక గా రూపొందిన రవితేజ “క్రాక్ “, పవన్ కళ్యాణ్ “వకీల్ సాబ్ “మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి కి జోడీ గా శృతి నటించిన “లాభం”తమిళ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. బ్లాక్ బస్టర్ “కెజిఎఫ్ చాప్టర్ 1″మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ , శృతి జంటగా యాక్షన్ థ్రిల్లర్ “సలార్ “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

'101 జిల్లాల అందగాడు' రిలీజ్ డేట్ ఖరారు
కరోనా సెకండ్ వేవ్ కారణంగా చాలా సినిమాలు వాయిదా పడిన సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు పరిస్థితులు కాస్త అనుకూలంగా ఉండటంతో అందరూ తమ సినిమా రిలీజ్ డేట్ లను ప్రకటించేస్తున్నారు. ఇప్పుడు అవసరాల శ్రీనివాస్ కూడా తన సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించేశాడు. రాచకొండ విద్యాసాగర్ దర్శకత్వంలో అవసరాల శ్రీనివాస్, రుహనీ శర్మ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా '101 జిల్లాల అందగాడు'. నిజానికి ఈసినిమా మే నెలలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ అప్పుడు కరోనా కారణంగా వాయిదా పడింది.

'ఇచ్చట వాహనములు నిలుపరాదు' రిలీజ్ డేట్ ఫిక్స్
కోరనా ప్రభావం చాలా వరకూ తగ్గింది. అలానే థియేటర్లు కూడా ఓపెన్ అయ్యాయి. దీంతో మేకర్స్ వీలైనంత త్వరగా తమ సినిమాలను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు . గత వారం పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయగా.. ఈ శుక్రవారం కూడా దాదాపు అరడజనుకు పైగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరోవైపు పలు సినిమాలు రిలీజ్ డేట్స్ ను ఫిక్స్ చేసుకొని థియేటర్లలోకి రావడానికి రెడీ అవుతున్నాయి. ఇక ఇప్పటికే ఎన్నో సినిమాలు రిలీజ్ డేట్ లను ఫిక్స్ చేసుకోగా ఇప్పుడు కూడా తన సినిమాతో వచ్చేస్తున్నాడు సుశాంత్.

కాకినాడ పోర్ట్ లో "లూసిఫర్ "
సూపర్ స్టార్ మోహన్ లాల్ , మంజు వారియర్ ప్రధాన పాత్రలలో రూపొందిన “లూసిఫర్ “మలయాళ మూవీ ఘనవిజయం సాధించింది.కొణిదెల ప్రొడక్షన్స్ , మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ , ఎన్ వి ఆర్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా “లూసిఫర్ “మలయాళ మూవీ తెలుగు రీమేక్ మూవీ తెరకెక్కనుంది . లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.ఫస్ట్ సాంగ్‌ను లండన్‌లోని అబ్బేరోడ్ స్టూడియోలో రికార్డ్ చేసినట్టు థమన్ ట్వీట్ చేశారు.

'మళ్ళీ మొదలైంది' లో పోసాని
కీర్తికుమార్ దర్శకత్వంలో సుమంత్ మళ్ళీ మొదలైంది అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఇటీవలే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా పెళ్లి తరువాత లైఫ్ ఎలా ఉంటుందో అన్న విషయాన్ని ఈ సినిమాలో చూపించారు. ఇక ఇదిలా ఉండగా ఈసినిమాలో మరో కీలక పాత్రలో పోసాని నటిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్.

"హరిహర వీరమల్లు" కెరీర్ కు పెద్ద బూస్ట్ - నిధి అగర్వాల్
“సవ్యసాచి “మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన నిధి అగర్వాల్ బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ “మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించి గుర్తింపు పొందారు. “భూమి “, ఈశ్వరన్”తమిళ మూవీస్ లో నిధి అగర్వాల్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నిధి ప్రస్తుతం మెగా సూర్యా ప్రొడక్షన్ బ్యానర్‌పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల కాలం నేపథ్యంలో జరిగే కథతో, అత్యద్భుతమైన విజువల్ ఫీస్ట్‌గా రూపొందుతున్న "హరిహర వీరమల్లు" మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.

'సలార్' షూటింగ్ పూర్తి చేసుకున్న శృతి హాసన్
కేజీఎఫ్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా సలార్. పూర్తి స్థాయి యాక్షన్ డ్రామాగా .. పాన్ ఇండియా లెవల్లో భారీ అంచనాల మధ్య ఈ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. కరోనా వల్ల కొన్ని రోజులు షూటింగ్ కు బ్రేక్ పడగా ఇటీవలే మళ్లీ షూటింగ్ ను స్టార్ట్ చేశారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

"అఖండ"మూవీ షూటింగ్ పూర్తి
దర్శకుడు బోయపాటి శ్రీను , హీరో బాలకృష్ణ కాంబినేషన్ లో రూపొందిన “సింహా “, “లెజెండ్ ” మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ ” మూవీ తెరకెక్కుతుంది . రెండు పవర్ ఫుల్ క్యారెక్టర్స్ తో హీరో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీ లో ప్రగ్య జైస్వాల్ , పూర్ణ కథానాయికలు. శ్రీకాంత్ , జగపతిబాబు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. హీరో బాలకృష్ణ నటిస్తున్న అఘోర పాత్ర, యాక్షన్ సీన్స్ “అఖండ “మూవీకి హైలైట్ కానున్నాయి.

రజనీకాంత్ పై మేఘ ఆకాష్ ఆసక్తికర వ్యాఖ్యలు
"లై "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన మేఘ ఆకాష్ , ఆ మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు."ఛల్ మోహన్ రంగ "మూవీ లో కథానాయికగా నటించిన మేఘ రజనీకాంత్ "పేట " మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. "శాటిలైట్ శంకర్ " మూవీ తో మేఘ బాలీవుడ్ కు ఎంటర్ అయ్యారు. మేఘ ప్రస్తుతం 2 తమిళ , 4 తెలుగు మూవీస్ లో నటిస్తున్నారు. మేఘ కథానాయికగా రూపొందిన "డియర్ మేఘ "మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. "డియర్ మేఘ "మూవీప్రమోషన్‌లో పాల్గొన్నమేఘ అభిమానుల ఆరాధ్య దైవం తలైవా రజనీకాంత్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

'శేఖర్' షూటింగ్ రీ స్టార్ట్ చేసిన రాజ శేఖర్
యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా సీనియర్ హీరోలు కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. హీరో రాజ శేఖర్ కూడా ఇప్పుడు అదే బాటలో ఉన్నారు. రాజశేఖర్ కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం లలిత్ అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో శేఖర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమాకు కూడా షూటింగ్ జరుపుకుంటుండగానే కరోనా సెకండ్ వేవ్ రావడంతో షూట్ కు బ్రేక్ పడింది. ఇక ఇప్పుడు మళ్లీ షూటింగ్ ను రీస్టార్ట్ చేశారు చిత్రయూనిట్. అరకులో ఈరోజు తాజా షెడ్యూల్ ను స్టార్ట్ చేశారు. ఇక సుమారు 20 రోజుల పాటు అంటే నెలాఖరు వరకు అరకులో షూటింగ్ చేసి... ఆ తర్వాత హైదరాబాద్ లో కొద్ది రోజులు... ఆతరువాత…

"సలార్ "షూట్ పై శృతి హాసన్ అప్ డేట్
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 “మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ శృతిహాసన్ జంటగా తెలుగు , కన్నడ భాషలలో 1970 ల బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టర్ మూవీ “సలార్ “ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. “సలార్ “ మూవీ ఒక షూటింగ్ షెడ్యూల్ గోదావరి ఖని వద్ద కోల్ మైన్స్ లో జరిగింది. కరోనా కారణంగా షూటింగ్ నిలిచిపోయిన “సలార్ “మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది.

"శాకుంతలం"కై కఠిన నియమాలు పాటించా - సమంత
తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయంతో ప్రేక్షకులను అలరిస్తూ సమంత స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత, దేవ్ మోహన్ జంటగా మహా భారతం ఆదిపర్వం లోని శకుంతల , దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా మైథలాజికల్ మూవీ “శాకుంతలం ” రూపొందుతున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్ సమంత ఫస్ట్ టైమ్ మైథలాజికల్ మూవీ లో నటిస్తుండడం విశేషం. సమంత ఒక తమిళ మూవీ లో కూడా నటిస్తున్నారు. “శాకుంతలం ” మూవీ హైదరాబాద్ లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఒక వారం రోజుల షూటింగ్ తో చిత్రీకరణ కంప్లీట్ అవుతుంది.