నాగచైతన్య ప్రస్తుతం హిందీ లో అమిర్ ఖాన్ నటిస్తున్న లాల్ సింగ్ చద్దా మూవీ లో ఓ ప్రత్యేక రోల్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇదిలా ఉండగా.. షూటింగ్ లో భాగంగా అమీర్ ఖాన్ తాజాగా అమలాపురం కూడా చేరుకున్నట్టు ఇప్పటికే పలు వార్తలు రావడం కూడా చూశాం. దీంతో పాటు ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా ఒకటి వినిపిస్తుంది. అదేంటంటే ఈసినిమాలో చైతు పాత్ర ఈసినిమాకు హైలెట్ గా నిలుస్తుందట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు వినిపిస్తున్న సమాచారం ప్రకారం చైతు అమలాపురంకి చెందిన యువకుడిగా ఆర్మీలో చేరుతాడు. అమీర్ ఖాన్, చైతు ఇద్దరూ ఆర్మీ అధికారులుగా, స్నేహితులుగా నటిస్తున్నారట. ఈ చిత్రంలో నాగ చైతన్య ఆర్మీ అధికారిగా వీరమరణం పొందుతాడట. అతడు మరణించిన తర్వాత నివాళులు అర్పించేందుకు అమీర్ ఖాన్ అమలాపురంకి వస్తాడట. చైతు, అమీర్ ఖాన్ మధ్య ఫ్రెండ్ షిప్ చాలా ఎమోషనల్ గా ఉంటుందని.. మరణించడం లాంటి సన్నివేశాలని దర్శకుడు అద్వైత్ చందన్ బలంగా చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే చైతు కు బాలీవుడ్ లో కూడా బాగానే బజ్ పెరుగుతుంది.
కాగా అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమా వయాకామ్ 18 స్టూడియోస్ సంస్థలు రూపొందిస్తున్నాయి. కరీనా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నఈసినిమాలో మోనా సింగ్, యోగి బాబు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: